ETV Bharat / entertainment

'టాలీవుడ్​లో ఆ ముగ్గురే నా బెస్ట్​ఫ్రెండ్స్​' - సీక్రెట్ రివీల్ చేసిన సాయిపల్లవి

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 19, 2024, 3:18 PM IST

Updated : Mar 19, 2024, 9:20 PM IST

Sai Pallavi Bestfriends In Tollywood : కోలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఇటీవలే టాలీవుడ్​లో తన బెస్ట్ ఫ్రెండ్స్ పేర్లను రివీల్ చేసింది. ఆ విశేషాలు మీ కోసం

Sai Pallavi Bestfriends In Tollywood
Sai Pallavi Bestfriends In Tollywood

Sai Pallavi Bestfriends In Tollywood : 'ఫిదా' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది హైబ్రీడ్​ పిల్ల సాయి పల్లవి. తొలి చిత్రంతోనే ఇక్కడి అభిమానులను ఆకట్టుకున్న ఈ చిన్నది ఆ తర్వాత కూడా తన నటనతో యువతను కట్టిపడేసింది. నేచురల్ యాక్టింగ్​తో పాటు క్యూట్​ లుక్స్​తో ​ ప్రేక్షకులను ఆకర్షించింది. అయితే టాలీవుడ్​కు పరిచయం కాకముందే సాయి పల్లవి 'ప్రేమమ్' అనే మలయాళ సినిమాతో పాపులరైంది. అందులోని మలర్​ క్యారెక్టర్​కు సౌత్​​ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యింది. ఆ తర్వాత కోలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్ ఇలా అన్ని భాషల్లోనూ మోస్ట్​ వాంటెడ్ హీరోయిన్​గా మారింది. డ్యాన్స్​తో అదరగొడుతూనే నటనతో మైమరిపిస్తుంది. అయితే ఈ మధ్య తెలుగు సినిమాలకు కొంచెం గ్యాప్ తీసుకున్న సై పల్లవి ఇప్పుడు 'తండేల్'​తో మరోసారి సిల్వర్ స్క్రీన్​పై కనిపించనుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ గురించి పలు ఆసక్తికరమై విషయాలు మాట్లాడింది. తెలుగు ఇండస్ట్రీలో తన బెస్ట్​ ఫ్రెండ్స్ పేర్లను రివీల్ చేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆ ముగ్గురు నాకు ఎప్పుడూ సపోర్టే
'టాలీవుడ్​లో నాకు డైరెక్టర్ శేఖర్ కమ్ములతో పాటు నాగ చైతన్య, రానా బెస్ట్​ ఫ్రెండ్స్​. వీళ్లు ఎప్పుడూ నాకు సపోర్ట్​గా ఉంటారు' అంటూ తన ఫ్రెండ్స్​ గురించి చెప్పుకొచ్చింది.

సాయి పల్లవి శేఖర్​ కమ్ముల కాంబినేషన్​లో వచ్చిన ఫిదా సినిమాలో ఆమె క్యారెక్టర్​కు మంచి మార్కులు పడ్డాయి. అందులో భానుమతి అనే అచ్చమైన తెలంగాణ ఆడపడచులా కనిపించింది. తెలంగాణ యాసలో ఆమె చెప్పిన డైలాగ్స్​కు అభిమానులు బాగా కనెక్ట్ అయ్యారు. అయితే ఈ పాత్రకు తనకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. ఆ కారణంతోనే భానుమతి పాత్ర అంతగా ఆడియెన్స్​ను ఆకట్టుకుందని దానికి కారణం కమ్ముల ప్రోత్సాహం అంటూ కొనియాడింది.

ఇక ఆ తర్వాత ఇదే కాంబోలో 'లవ్ స్టోరీ' సినిమా వచ్చింది. ఇందులో నాగచైతన్య లీడ్​ రోల్​లో కనిపించారు.అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో టాక్ అందుకోనప్పటికీ అందులోని సాయి పల్లవికి క్యారెక్టర్​ ఆమెకు మంచి పేరే తీసుకొచ్చింది. అప్పుడు నాగ చైతన్య తో పరిచయం ఆమెకు కూడా మంచి స్నేహంగా మారిందంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత రానాతో చేసిన 'విరాట పర్వం' సినిమా కూడా ఆమెలోని విలక్షణ నటనను బయటికి తీసుకొచ్చింది. ఫ్యాన్స్​ను ఎమోషనల్​గా కనెక్ట్ చేసింది. ఈ సినిమా ద్వారా రానా కూడా మంచి స్నేహితుడయ్యాడంటూ చెప్పుకొచ్చింది. అలా ఈ సినిమాలతో తన బెస్ట్ ఫ్రెండ్స్ ముగ్గురితో పని చేయగలిగింది సాయి పల్లవి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సెలక్టివ్ రోల్స్​కు సాయి పల్లవి సై - సినిమాల్లో కచ్చితంగా ఆ ఎలిమెంట్ ఉండాల్సిందే!

సాయి పల్లవి సినిమా రీ రిలీజ్​ - ఐదు రోజుల్లో రికార్డ్ రేంజ్​ కలెక్షన్స్​!

Last Updated : Mar 19, 2024, 9:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.