ETV Bharat / entertainment

సెలక్టివ్ రోల్స్​కు సాయి పల్లవి సై - సినిమాల్లో కచ్చితంగా ఆ ఎలిమెంట్ ఉండాల్సిందే!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 20, 2024, 5:09 PM IST

Updated : Feb 20, 2024, 7:16 PM IST

Sai Pallavi Movies : కోలీవుడ్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం సెలక్టివ్ సినిమాల్లోనే నటించేందుకు ఓకే చెప్తోంది. అంతేకాకుండా ఆమె సినిమాల్లో నటించాలంటే అందులో కచ్చితంగా ఆ ఎలిమెంట్ ఉండాలని అంటోందట. ఇంతకీ అదేంటంటే ?

Sai Pallavi Emotional Movies
Sai Pallavi Emotional Movies

Sai Pallavi Movies : తన నేచురల్ బ్యూటీతో అందరి హృదయాలను కొల్లగొడుతోంది యంగ్ హీరోయిన్ సాయి పల్లవి. సింపుల్​గా కనిపిస్తూనే అన్ని పాత్రలను అవలీలగా చేసే ఈ చిన్నది తన నటనతో అటు టాలీవుడ్​తో పాటు ఇటు కోలీవుడ్​లోనూ అగ్ర హీరోల సరసన నటిస్తోంది. మలయాళ 'ప్రేమమ్'లో స్పెషల్ రోల్​లో నటించిన సాయి పల్లవి భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల్లోనూ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత కోలీవుడ్, టాలీవుడ్​లో వరుస ఆఫర్లు అందుకుని బిజీగా ఉంది. అయితే తనవద్దకు వచ్చిన అన్ని సినిమాలకు ఓకే చెప్పకుండా సెలక్టివ్​ కథలనే ఎంచుకుంటోంది.

రోమాంటిక్ జానర్​కు నో చెప్తూనే తన అప్పీయరెన్స్, తన క్యారెక్టర్ స్కోప్​ను బట్టి ఆయా సినిమాలకు సైన్ చేస్తోంది. గతంలో 'భోళా శంకర్' సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్ర కోసం సాయి పల్లవిని అప్రోచ్ అయ్యారట. అయితే ఆ సినిమాలో తన క్యారెక్టర్​కు పెద్దగా స్కోప్ లేకపోవడం వల్ల దానికి నో చెప్పారట. దీన్ని బట్టి ఈ కోలీవుడ్ బ్యూటీ కథల విషయంలో ఎంత సెలెక్టివ్​గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం నాగచైతన్య సరసన 'తండేల్' అనే సినిమాలో నటిస్తోంది. గతంలో 'లవ్​స్టోరీ' సినిమాలో కనిపించి సందడి చేసిన ఈ జంట మరో సారి స్క్రీన్ షేర్ చేసుకునేందుకు రెడీ అవుతోంది. ఇటీవలే విడుదలైన గ్లింప్స్ చూస్తుంటే ఇందులో సాయి పల్లవి క్యారెక్టర్​కు ప్రేక్షకులు చాలా డీప్​గా కనెక్ట్ అవుతారని తెలుస్తోంది. పైగా ఇది కొంచం ఎమోషనల్​ కంటెంట్​తో రూపొందుతున్న సినిమా కావడం వల్ల దీనికి ఆమె ఓకే చెప్పారట. సినిమాల్లో ఎమోషన్ ఉంటే ఇక సాయి పల్లవి దానికి కచ్చితంగా ఓకే చెప్తుందని టాక్ నడుస్తోంది. ఫలితాలతో సంబంధం లేకుండా తన నటనతో అందరినీ ప్రశంసలు పొందుతోంది. గతంలో వచ్చిన శ్యామ్ సింగరాయ్​, విరాట పర్వం సినిమాలు ఆశించిన స్థాయిలో టాక్ అంగదుకోలేకపోయింది. అయితే ఇందులో సాయి పల్లవి యాక్టింగ్​కు మంచి మార్కులు పడ్డాయి. అలా కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూనే ఎమోషనల్ జానర్​లో రాణిస్తోంది ఈ కోలీవుడ్ బ్యూటీ.

ఇక సాయి పల్లవి ప్రస్తుతం పలు తమిళ, తెలుగు సినిమాలకు సైన్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగుల్లో బిజీగా గడుపుతోంది. అయితే సౌత్​లో తన సత్తా చాటిన ఈ చిన్నది ఇప్పుడు బాలీవుడ్​ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసేందుకు సిద్ధమవుతోంది. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్​ ఖాన్​తో ఓ మూవీకి సైన్ చేశారట. అయితే అందులోనూ ఎమోషనల్ కంటెంట్ ఉందని సమాచారం. పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తున్నా కూడా తన కమిట్​మెంట్​తో సెలక్టివ్ సినిమాలు చేస్తోంది సాయి పల్లవి. ఇప్పటి హీరోయిన్లలో ఇలా పట్టుదలగా ఉన్నవారు అరుదే అని చెప్పవచ్చు.

సాయి పల్లవి సినిమా రీ రిలీజ్​ - ఐదు రోజుల్లో రికార్డ్ రేంజ్​ కలెక్షన్స్​!

సాయిపల్లవికి క్రేజీ ఆఫర్​- యశ్​ సినిమాలో హీరోయిన్​గా ఛాన్స్​!

Last Updated :Feb 20, 2024, 7:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.