ETV Bharat / entertainment

ఏనుగు పిల్లకు స్నానం చేయించిన బుజ్జి క్లీంకార- థాయ్​లాండ్​లో ఎంజాయ్ చేసిన చెర్రీ ఫ్యామిలీ ! - Ram Charan Family Trip

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 7, 2024, 12:24 PM IST

Updated : Apr 7, 2024, 12:44 PM IST

Ram Charan Family Trip
Ram Charan Family Trip

Ram Charan Family Trip : టాలీవుడ్ స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ రామ్​ చరణ్ తాజాగా షూటింగ్​కు చిన్న బ్రేక్ ఇచ్చి తన ఫ్యామిలీతో థాయ్​లాండ్​కు పయనమయ్యారు. తాజాగా ఈ వెకేషన్​కు సంబంధించిన ఫొటోలను ఆయన సతీమణి షేర్ చేశారు. ఆ ఫొటోలు మీ కోసం

Ram Charan Family Trip : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్​ ఇటీవల తన కుటుంబంతో పాటు పలువురు ఫ్రెండ్స్​తో కలిసి థాయ్​లాండ్​ వెకేషన్​కు వెళ్లారు. అక్కడ సరదగా గడిపి ఇప్పుడు హైదరబాద్​కు తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో రామ్​ చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియా వేదికగా తాము వెకేషన్​లో స్పెండ్ చేసిన బ్యూటిఫుల్ మూమెంట్స్​ను షేర్ చేశారు. అందులో చెర్రీ, ఉపాసన తమ గారాల పట్టి క్లీన్​కారాతో కలిసి ఓ గున్న ఏనుగుకు స్నానం చేయిస్తూ కనిపించారు. ఇంక మరో ఫొటోలో కుక్క పిల్ల రైమ్ కూడా సముద్రంలో స్విమ్ చేస్తూ సందడి చేసింది.

ఇక రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూటింగ్​లో బిజీగా ఉన్నారు. పొలిటికల్​ యాక్షన్​ థీమ్​తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఇందులో రామ్​చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తుండగా, ఈ సినిమాలో నటి అంజలి, SJ సూర్య, శ్రీకాంత్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్​రాజు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్​పై శిరీష్​తో ఈ చిత్రాన్ని సంయుక్తంగా రూపొందిస్తున్నారు. ఇటీవలే చెర్రీ బర్త్​డే స్పెషల్​గా ఈ చిత్రం నుంచి జరగండి అనే సాంగ్​ను విడుదల చేేేశారు.

ఇక డైరెక్టర్ శంకర్​ ఈ పాటను చాలా గ్రాండ్​గా డిజైన్ చేశారు. నేచురల్ లుక్ కోసం ప్రత్యేకంగా ఈ సెట్ వేశారు. దీనికి కోసం మేకర్స్ భారీగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దీంతో బ్యాక్​గ్రౌండ్ సెట్స్, విజువల్ వర్క్స్​ అదిరిపోయాయి. రియల్ లొకేషన్​లోనే సాంగ్ షూట్ చేసినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా రామ్​చరణ్- కియారా లుక్స్​, స్క్రీన్ ప్రెజెన్స్ సాంగ్​కు హైలైట్​గా నిలిచాయి. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ, స్టిల్స్​, కాస్ట్యూమ్​కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

రచయిత అనంత శ్రీరామ్ పాటకు లిరిక్స్ అందించగా ఎప్పటిలాగే తమన్ మ్యూజిక్​ ఇరగదీశారు. డ్యాన్స్​ మాస్టర్ ప్రభుదేవా 'జరగండి' సాంగ్​కు కొరియోగ్రఫి చేపట్టారు. ఇక రామ్​చరణ్​కు బర్త్​ డే విషెస్ చెప్తూ, సాంగ్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్​ కామెంట్ చెస్తున్నారు. ఇక ఈరోజే 'జరగండి' తమిళ్ వెర్షన్ సాంగ్ కూడా రిలీజైంది. దీంతో పాటు ఆయన త్వరలో బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న సినిమాలోనూ కనిపించనున్నారు. ఇవి కాకుండా సుకుమార్​తో RC 17 సినిమాను ఖరారు చేశారు.

గ్లోబల్ స్టార్​ రామ్​ చరణ్​కు అదంటే చాలా భయమట! - Ramcharan Happy Birthday

Ram Charan Foreign Trip : క్లీంకార ఫస్ట్​​ ఫారిన్​ ట్రిప్​.. ఉపాసన ఒడిలో బుజ్జమ్మ.. ఎక్కడి వెళ్తున్నారంటే?

Last Updated :Apr 7, 2024, 12:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.