ETV Bharat / entertainment

Ram Charan Foreign Trip : క్లీంకార ఫస్ట్​​ ఫారిన్​ ట్రిప్​.. ఉపాసన ఒడిలో బుజ్జమ్మ.. ఎక్కడి వెళ్తున్నారంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2023, 4:02 PM IST

Updated : Oct 18, 2023, 4:25 PM IST

Ram Charan Foreign Trip : రామ్ చరణ్ ఉపాసన ప్రస్తుతం ఫారిన్​ ట్రిప్​కు వెళ్తున్నారు. తమ గారాలపట్టి క్లీంకారను తీసుకుని వెకేషన్​కు ప్లాన్ వేశారు. ఎయిర్​ పోర్టులో రామ్ చరణ్​, ఉపాసన కనిపించారు. ఈ ఫోటోలు సోషల్​ మీడియాలో తెగ హాల్​చల్​ చేస్తున్నాయి.

Klin kaara First Foreign Trip : క్లీంకారతో కలిసి రామ్ చరణ్ ఉపాసన​ ఫారిన్​ ట్రిప్​.. ఎక్కడి వెళ్తున్నారంటే..?
Klin kaara First Foreign Trip : క్లీంకారతో కలిసి రామ్ చరణ్ ఉపాసన​ ఫారిన్​ ట్రిప్​.. ఎక్కడి వెళ్తున్నారంటే..?

Ram Charan Foreign Trip : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్​ తన ఫ్యామిలీని తీసుకొని ఫారిన్​ ట్రిప్​కు వెళ్తున్నారు. తన భార్య ఉపాసన, కూతురు క్లీంకార, పెట్​ రైమ్​ను తీసుకుని ట్రిప్​కు బయలుదేరారు. ఈ మేరకు ఎయిర్​ పోర్టులో దర్శనం ఇచ్చాడు. చెర్రీ చేతిలో రైమ్​, ఉపాసన ఒడిలో క్లీంకార ఇలా ఇద్దరు క్యాజువల్​ లుక్స్​లో ఎయిర్ పోర్టులో ప్రత్యక్షమయ్యారు. ప్రస్తుతం వీళ్ల ఫోటోలు సోషల్​ మీడియాలో ట్రెండ్​ అవుతున్నాయి. అయితే ఉపాసన తన కూతురు ముఖాన్ని మాత్రం కెమెరాలకు చూపించలేదు.

రామ్​ చరణ్ తన కూతురు పుట్టాక ఇదే మొదటి ట్రిప్​ కానుంది. చెర్రీ తన కూతుర్ని ఇటలీకి తీసుకెళ్తున్నారని సమాచారం. 'గేమ్​ ఛేంజర్' షూటింగ్​తో బిజీగా ఉన్న చరణ్​.. ఇలా తన ఫ్యామిలీకి కొంత టైమ్​ కేటాయించి ఫారిన్ ట్రిప్​కి వెళ్తున్నారు. ఉపాసన క్లీంకారను, చెర్రీ రైమ్​లను తీసుకుని వెళ్తుండగా.. ఎయిర్​ పోర్టు వద్ద క్లిక్​మనిపించిన ఫోటోలు మెగా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముగ్గురూ చూడముచ్చటగా ఉన్నారంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Ram Charan Baby : క్లీంకార రాకతో మెగా ఫ్యామిలీలో ఆనందం వెల్లివిరిసిందన్న సంగతి తెలిసిందే. ఇక క్లీంకారతో కలిసి మెగాస్టార్ చిరంజీవి దిగినవి, మనవరాలిని ఎత్తుకుని చిరు సంబరపోతూ ఉన్న ఫోటోలు అభిమానులను ఆకట్టుకున్నాయి. మెగా ప్రిన్సెస్ కొణిదెల ఇంటికి వచ్చిన తరుణంలో చిరంజీవి ప్రత్యేకంగా వేదమంత్రాలు పఠించే వారిని తీసుకొచ్చి మరీ ఆహ్వానం పలికించారు.

ఇక రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్​ తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమాకు తమన్​ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే గేమ్​ ఛేంజర్ షూటింగ్ పలుమార్లు వాయిదాలు పడటం వల్ల.. సినిమా ఎప్పుడు వస్తుందా అని చెర్రీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఆ తరువాత బుచ్చిబాబు సానా ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల చెర్రీ ముంబైకి వెళ్లినప్పుడు .. అక్కడ రాజ్ కుమార్ హిరాణితో చర్చించారని, వారిద్దరి కాంబోలో సినిమా ఉంటుందనే రూమర్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

Leo Ramcharan : 'లియో'లో రామ్​ చరణ్​.. అసలు నిజం ఇదే!.. మెగాఫ్యాన్స్​ గుస్సా

Ramcharan Alluarjun : మళ్లీ తెరపైకి అదే ప్రచారం​.. ఇప్పుడంతా దీని గురించే చర్చ!.. ట్రోలర్స్​కు ఫుల్​ స్టఫ్​!

Last Updated : Oct 18, 2023, 4:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.