ETV Bharat / entertainment

ఆరు భాషల్లో 'పుష్ప పుష్ప' సాంగ్​ - ఎలా ఉందంటే ? - Pushpa 2 Title Song

author img

By ETV Bharat Telugu Team

Published : May 1, 2024, 5:10 PM IST

Updated : May 1, 2024, 8:22 PM IST

Pushpa 2 Title Song
Pushpa 2 Title Song

Pushpa 2 Title Song : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప 2' సినిమా నుంచి మేకర్స్ ఓ పుష్ప పుష్ప సాంగ్​ను రిలీజ్ చేశారు.

Pushpa 2 Title Song : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లీడ్ రోల్​లో రానున్న పుష్ప 2 సినిమా నుంచి మేకర్స్ ఓ సూపర్​ సాంగ్​ను రిలీజ్ చేశారు. పుష్ప పుష్ప అంటూ సాగే ఆ టైటిల్ సాంగ్​ను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళం ఇలా పలు భాషల్లో రిలీజ్ చేశారు. క్యాచీగా ఉన్న ఈ ట్యూన్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. బెంగాళీలో ఈ సాంగ్ త్వరలో రానున్నట్లు తెలుస్తోంది.

ఊర మాస్​గా ఉన్న ఈ సాంగ్​ను మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ తన ట్యూన్​తో మరికాస్త ఎనర్జీటిక్​గా మలిచారు. 'నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే' అంటూ సూపర్ లిరిక్స్​ను సాంగ్​కు అందించారు లిరిసిస్ట్ చంద్రబోస్. ఇందులో పుష్పరాజ్‌ మ్యానరిజంను ఎంతో చక్కగా వివరించారు. ఇదిలా ఉండగా రిలీజైన నిమిషాల్లోనే ఈ సాంగ్​కు అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ వస్తోంది.

పుష్ప ది రైజ్ చిత్రంతో నేషనల్‌ అవార్డు అందుకున్నారు బన్నీ. తగ్గేదే లే అంటూ దేశవ్యాప్తంగా తన బ్రాండ్‌ ఇమేజ్​ను పెంచుకున్నారు. ముఖ్యంగా ఈ చిత్రానికి బన్నీ యాక్టింగ్​తో పాటు దేవీ శ్రీ ప్రసాద్​ అందించిన సంగీతం మరింత బలంగా నిలిచింది. దీంతో అందుకు తగ్గట్లుగానే రెండో భాగాన్ని కూడా తెరకెక్కించారు మేకర్స్‌. అసలు ప్రేక్షకుడు ఊహించలేని ట్విస్ట్‌ లేదా హై ఓల్టేజ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రం కోసం దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌నుపెట్టారని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్‌ ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తోంది.

ఈ సీక్వెల్‌ను వరల్డ్ వైడ్​గా ఆగస్ట్ 15న గ్రాండ్​గా రిలీజ్ చేయనున్నారు. కచ్చితంగా ఈ చిత్రం రూ.1000 కోట్లకు పైగానే వసూలు చేస్తుందని సినీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్‌ థియేట్రికల్ రైట్స్​ రూ.200 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం అందుతోంది. నార్త్‌లో ఈ రేంజ్​లో భారీ మొత్తానికి అమ్ముడుపోయిన తొలి సినిమాగా పుష్ప రికార్డ్‌ క్రియేట్‌ చేసిందని కథనాలు వస్తున్నాయి.

సినిమాలో హీరోయిన్​గా రష్మిక మందాన నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్​, సునీల్, అనసూయ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి స్పెషల్ సాంగ్​లో ఎవరు చిందులేయనున్నారో ఇంకా స్పష్టత రాలేదు. ఇక ఇప్పటికే విడుదల చేసిన రెండు స్పెషల్​ గ్లింప్స్​లు ఫ్యాన్స్​లో గూస్​బంప్స్ తెప్పించి సోషల్ మీడియాను షేక్ చేశాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'పుష్ప 2' - 'కల్కి' - అవన్నీ​ నిజమయ్యేటట్టు ఉందిగా!

నార్త్​లో 'పుష్ప' డామినేషన్- OTT, థియేట్రికల్​ రైట్స్​కే రూ.475 కోట్లు- ఇది సార్ ఐకాన్ స్టార్ బ్రాండు! - Pushpa 2 OTT Rights

Last Updated :May 1, 2024, 8:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.