ETV Bharat / entertainment

హీరోగా ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్ కజిన్​ - సినిమా టైటిల్ ఏంటంటే? - Prabhas Family Hero

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 10, 2024, 11:14 AM IST

Updated : Apr 10, 2024, 12:25 PM IST

Prabhas cousin
Prabhas cousin

Prabhas Cousin Virat Raj Tollywood Debut : టాలీవుడ్‌లో వార‌సులు ఎంట్రీ ఇవ్వ‌డం కొత్తేమీ కాదు. ఇప్పుడున్న స్టార్ హీరోల్లో చాలా మంది వార‌సులుగా వచ్చినవారే. అయితే తాజాగా పాన్ ఇండియా స్టార్​ ప్ర‌భాస్ ఫ్యామిలీ నుంచి కొత్త వార‌సుడు టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. ప్ర‌భాస్ క‌జిన్ విరాట్‌ రాజ్ హీరోగా మారారు. గౌడ్‌సాబ్ పేరుతో ఓ సినిమా చేయనున్నారు. ఈ మూవీ తాజాగా లాంఛ‌నంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. ఈ చిత్రంతో కొరియోగ్రాఫ‌ర్ గ‌ణేశ్​ మాస్ట‌ర్ డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం అవుతున్నారు.

మొదట ఈ సినిమా లాంఛ్​కు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్​తో పాటు పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్​గా వస్తారని ప్రచారం జరిగింది కానీ అది కుదరలేదు. డైరెక్టర్ సుకుమార్ వచ్చి ఈ సినిమా టైటిల్ పోస్టర్ లాంఛ్ చేశారు. తరవాత పవన్ కళ్యాణ్ ఆశీర్వాదంతో ఈ మూవీ పోస్టర్ లాంఛ్ అయినట్టు మూవీటీమ్ ప్రకటించింది. పాత బైక్ పై అమ్మాయి వోణి వాలుతున్నట్లుగా ఉన్న పోస్టర్​ను విడుదల చేశారు. ఈ పోస్టర్ నెట్టింట వైరల్​గా మారింది.

హీరోగా విరాట్ రాజ్​కు ఇది తొలి చిత్రం. అలాగే హీరోయిన్ కూడా కొత్త అమ్మాయి ఉంటుందని సినిమా యూనిట్ ప్రకటించింది. యాక్షన్ కథాంశంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మిగతా నటీనటులు గురించి త్వరలోనే ప్రకటిస్తామని డైరెక్టర్ గణేశ్ మాస్టర్ చెప్పారు. విరాట్ రాజ్ ఎత్తులో శరీర సౌష్టవంలో ప్రభాస్​లో ఉండటంతో ఇలాంటి యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ సినిమాలు అతనికి బాగుంటాయి. ఈ సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు ఒక అందమైన లవ్ స్టొరీ కూడా ఉందని ఈ సినిమా కథను తాను సంవత్సరం నుంచి రాసుకుంటున్నాను అని చెప్పారు గణేష్ మాస్టర్. ఇకపోతే ఈ సినిమాకు వెంగీ సంగీతం సమకూరుస్తున్నారు.ఎస్ఆర్ క‌ళ్యాణ‌మంట‌పం సినిమాను నిర్మించిన రాజు, వెంక‌ట ర‌మ‌ణ‌, సాయికృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

కాగా, ఢీ రియాల్టీ షోతో పేరు తెచ్చుకున్న గణేశ్ మాస్టర్ గబ్బర్ సింగ్, అల వైకుంఠపురంలో, భీమ్లా నాయక్ వంటి సినిమాలకు కొరియోగ్రాఫర్​గా పనిచేశారు. గబ్బర్ సింగ్ సినిమాకు సినీ'మా' అవార్డు కూడా గెలుచుకున్నారు.

వంటలక్క ప్రేమి విశ్వనాథ్​కు ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? - Vantalakka Remuneration

ఇండస్ట్రీలోనే తొలిసారి - ఒంటిచేత్తోనే ఓ సినిమా కోసం 21 క్రాఫ్ట్స్​ మేనేజ్ చేసిన యాక్టర్! - Gugan Chakravarthiyar

Last Updated :Apr 10, 2024, 12:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.