ETV Bharat / entertainment

సడెన్​గా OTTలోకి వచ్చేసిన కిల్లర్ గేమ్ మూవీ - ప్రతీ సీన్ సూపర్ థ్రిల్​తో!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 28, 2024, 10:49 AM IST

సడెన్​గా OTTలోకి వచ్చేసిన కిల్లర్ గేమ్ మూవీ - ప్రతీ సీన్ సూపర్ థ్రిల్​తో!
సడెన్​గా OTTలోకి వచ్చేసిన కిల్లర్ గేమ్ మూవీ - ప్రతీ సీన్ సూపర్ థ్రిల్​తో!

Game On Movie OTT : ఓటీటీ ఆడియెన్స్​ను థ్రిల్​ చేసేందుకు ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ స్ట్రీమింగ్​కు వచ్చేసింది. ఈ చిత్రం ప్రతి క్షణం ప్రేక్షకుల్ని మునివేళ్లపై నిలబెడుతూ మంచి థ్రిల్ ఇస్తోందని అంటున్నారు. ఇంతకీ ఆ చిత్రం ఏంటంటే?

Game On Movie OTT : ఓటీటీలోకి ఎన్నో రకాల జానర్ సినిమాలు తెరపైకి వచ్చి సందడి చేస్తుంటాయి. తాజాగా ఇప్పుడు ప్రేక్షకులను అలరించేందుకు మరో కొత్త సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ వచ్చింది. అదే గేమ్​ ఆన్. గతంలో బ్లూ వేల్ అనే ఆన్ లైన్ కిల్లర్​ గేమ్​కు బానిసై ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఛాలెంజ్​లు విసురుతూ ఆత్మహత్యకు ప్రేరేపించే ఈ ఆటను అప్పట్లో చాలా దేశాల్లోనూ బ్యాన్ చేశారు. దీనినే కథా నేపథ్యంగా తీసుకుని కాస్త అటూ ఇటూ మార్చి తాజాగా తెరకెక్కించిన చిత్రమే గేమ్ ఆన్‌. రీసెంట్​గానే బిగ్ స్క్రీన్​పైకి వచ్చిన ఈ చిత్రం అప్పుడు నెల తిరగకుండానే సైలెంట్​గా స్ట్రీమింగ్​కు కూడా వచ్చేసింది. వచ్చీ రాగానే మంచి రెస్పాన్సే అందుకుంటోంది.

ఈ చిత్రంలో గీతానంద్, నేహా సోలంకి ప్రధాన పాత్రల్లో నటించారు. డిఫరెంట్ కాన్సెప్ట్​తో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న థియేటర్లలో విడుదలైంది. ట్రైలర్​తో బజ్ క్రియేట్ చేసి కథ పరంగా ఇంట్రెస్ట్​గానే ఉన్నా ఎందుకో థియేటర్లలోకి అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. ఇప్పుడు సడెన్​గా అమెజాన్ ప్రైమ్​లో దర్శనమిచ్చింది. సినిమాలో పలు పాత్రలు ఉన్నప్పటికీ ప్రధానంగా రెండు పాత్రల మధ్యే ఈ స్టోరీ ఎక్కువగా నడుస్తుంది.

కథేంటంటే? : ఓ ఫోన్ కాల్​ ద్వారా వచ్చిన టాస్కులు చేస్తూ జీవనం సాగించే యువకుడికి ఎదురైన సవాళ్లు, పరిస్థితులే ఈ గేమ్ ఆన్ మూవీ. గౌతమ్ (గీతానంద్) ఒక గేమింగ్ కంపెనీలో పని చేస్తుంటాడు. అక్కడే మోక్ష (వాసంతి) అనే యువతితో ప్రేమలో పడతాడు. అదే సమయంలో అతడి మంచితనాన్ని స్నేహితులు బాగా వాడుకుంటారు.. ఈ క్రమంలోనే వృత్తిపరంగా అతడు టార్గెట్​ను కంప్లీట్ చేయలేకపోతాడు. దీంతో అతడిని ఉద్యోగంలో నుంచి నుంచి తీసేస్తారు. జాబ్ పోవడంతో సూసైడ్ చేసుకోవాలని అతడు అనుకుంటాడు. కానీ అదే సమయంలో ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. పలు టాస్క్​లు ఇచ్చి వాటిని కంప్లీట్ చేస్తే డబ్బులు ఇస్తానంటాడు. అతడు చెప్పినట్టుగా చిన్న చిన్న టాస్క్​లను గీతానంద్ పూర్తి చేస్తాడు. కానీ చివరికి ఓ మర్డర్ చేయాలని టాస్క్ వస్తుంది. అక్కడే అసలు కథ మొదలవుతుంది. మరి ఆ మర్డర్ టాస్క్​ను గౌతమ్ కంప్లీట్​ చేశాడా? లేదా? తన లవ్​ స్టోరీ సక్సెస్ అయిందా? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

10ఏళ్ల పాటు డేటింగ్​ - సీక్రెట్​గా పెళ్లి చేసుకోనున్న ప్రముఖ హీరోయిన్!

ఆపరేషన్ వాలెంటైన్ - 'ఆ సినిమా కోసం నా పెళ్లి ముహూర్తాన్ని మార్చుకున్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.