ETV Bharat / entertainment

యూట్యూబ్​లో తెలుగు సాంగ్స్ హవా- ఫాస్టెస్ట్ 200 మిలియన్ క్లబ్​లో చేరిన పాట ఏదంటే? - Kurchi Madatha Petti Song

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 22, 2024, 8:07 AM IST

Updated : Apr 22, 2024, 11:40 AM IST

fastest 200 million views telugu song
fastest 200 million views telugu song

Fastest 200 Million Views Telugu Song: 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ రీసెంట్​గా యూట్యూబ్​లో 200 మిలియన్ వ్యూస్ సాధించి అరుదైన రికార్డు కొట్టింది. ఈ పాట రిలీజైన 78 రోజుల్లోనే ఈ మైలురాయి అందుకుంది. మరి టాలీవుడ్​లో అతితక్కువ రోజుల్లో 200+ మిలియన్ క్లబ్​లో చేరిన పాట ఏదో మీకు తెలుసా?

Fastest 200 Million Views Telugu Song: టాలీవుడ్​ స్టార్ హీరో మహేశ్ బాబు- శ్రీలీల సూపర్ హిట్ మూవీ 'గుంటూరు కారం' సినిమాలోని 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ రీసెంట్​గా యూట్యూబ్​లో 200 మిలియన్ వ్యూస్ సాధించి అరుదైన రికార్డు కొట్టింది. ఈ పాట రిలీజైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్​లో నడించింది. ఈ మధ్య కాలంలో గ్రాండ్ ఈవెంట్స్​, బర్త్​డే ఫంక్షన్స్ ఇలా ఎక్కడ చూసిన ఈ పాటే ఎక్కువగా వినిపించింది. దీంతో సాంగ్ వచ్చిన 78 రోజుల్లోనే 200+ మిలియన్ క్లబ్​లో చేరింది. అయితే యూట్యూబ్​లో అతి తక్కువ రోజుల్లో ఈ మైల్​స్టోన్ దాటిన సాంగ్ ఏంటో మీకు తెలుసా?

అల్లు అర్జున్ బ్లాక్​బస్టర్ పుష్ప పార్ట్- 1 మూవీలోని 'ఊ అంటావా? ఉఊ అంటావా' సాంగ్ ఈ లిస్ట్​లో టాప్​లో ఉంది. ఈ పాట రిలీజైన 68 రోజుల్లోనే యూట్యూబ్​లో 200+ మిలియన్ వ్యూస్ అందుకుంది. ఈ క్రమంలో యూట్యూబ్​లో అతి తక్కువ రోజుల్లో ఈ ఘనత సాధించిన తెలుగు పాటగా రికార్డు కొట్టింది. ఇప్పటి దాకా ఈ సాంగ్​కు 414 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దేవీ శ్రీ కంపోజ్ చేసిన ఈ సాంగ్​ ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ ప్లే లిస్ట్​లో ఉంటుంది. ఇక ఈ సాంగ్​లో స్టార్ హీరోయిన సమంత స్పెషల్ అప్పియరెన్స్​ ఇచ్చింది. బన్నీతో పోటీపడి మరీ సమంత స్పెప్పులు వేసి ఆడియెన్స్​ను ఆకట్టుకుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇక ఈ లిస్ట్​లో మూడో స్థానంలోనూ అల్లు అర్జున్ పాటే ఉండడం విశేషం. బన్నీ- పూజా హెగ్డే 'బుట్టబొమ్మ బుట్టబొమ్మ' పాట 95 రోజుల్లో ఈ ఫీట్ సాధించింది. ఈ పాట కూడా అప్పట్లో సెన్సేషనల్ క్రియేట్ చేసింది. ఈ సాంగ్​కు సోషల్ మీడియాలో రీల్స్ సైతం అదిరిపోయాయి. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం తన చిన్నారులతో ఈ పాటకు రీల్స్ చేశాడు. ఈ సాంగ్ 873 మిలియన్ వ్యూస్​తో ఇప్పటికీ యూట్యూబ్​లో ప్లే అవుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

200 మిలియన్​ ప్లస్​ - నెట్టింట కుర్చి మడతపెట్టి సాంగ్ ర్యాంపేజ్​! - Kurchi Madatha Petti Song

'ఫ్యామిలీ స్టార్' సాంగ్​కు బుట్టబొమ్మ స్టెప్పులు - భలే క్యూట్​గా ఉందిగా!

Last Updated :Apr 22, 2024, 11:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.