ETV Bharat / entertainment

శిల్పాశెట్టి దంపతులపై ఈడీ కేసు - రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్‌ - Ed Money Laundering Case

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 18, 2024, 1:28 PM IST

Updated : Apr 18, 2024, 2:09 PM IST

Raj Kundra Shilpa Shetty ED Case : బిట్‌కాయిన్స్​ పేరుతో మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసు విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తాజాగా దర్యాప్తు మరింత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి దంపతులపై ఈడీ చర్యలు చేపట్టింది.

Ed Money Laundering Case
Ed Money Laundering Case

Raj Kundra Shilpa Shetty ED Case : బిట్‌కాయిన్స్​ పేరుతో మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసు విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తాజాగా దర్యాప్తు మరింత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి దంపతులపై ఈడీ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 నిబంధనల ప్రకారం రాజ్‌ కుంద్రాకు చెందిన రూ.97.79కోట్ల స్థిర, అలాగే చరాస్తులను అటాచ్‌ చేసింది. అందులో భాగంగానే జుహూలోని ఓ ఫ్లాట్‌ శిల్పా శెట్టి పేరు మీద ఉన్నట్లు తెలిపింది. ఇది కాకుండా పుణెలోని బంగ్లా, అలాగే రాజ్‌ కుంద్రా పేరుపై ఉన్న ఈక్విటీ షేర్లను కూడా అటాచ్‌ చేసినట్లు వెల్లడించింది.

ముంబయికి చెందిన 'వేరియబుల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌' అనే సంస్థ 2017లో 'గెయిన్‌ బిట్‌కాయిన్‌ పోంజీ స్కీమ్‌'ను నిర్వహించింది. ఇందులో భాగంగానే బిట్‌కాయిన్లపై పెట్టుబడులు పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయంటూ ప్రజలకు ఆశ చూపి మల్టీ-లెవల్‌ మార్కెటింగ్‌ పద్ధతిలో ఏజెంట్ల ద్వారా ముంబయి, దిల్లీ నగరాల్లోని పలువురి నుంచి దాదాపు రూ.6,600 కోట్లును ఆ సంస్థ వసూలు చేశారు. ఈ మోసం బయటపడటం వల్ల సంస్థ, దాని ప్రమోటర్లపై ఈడీ కేసు నమోదు చేసి తాజాగా దర్యాప్తు చేపట్టింది.

అయితే ఈ స్కామ్‌ మాస్టర్‌ మైండ్‌ అయిన అమిత్ భరద్వాజ్‌ నుంచి శిల్ప శెట్టి భర్త రాజ్‌ కుంద్రా 285 బిట్‌కాయిన్లను తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది. వీటితోనే ఉక్రెయిన్‌లో ఓ బిట్‌కాయిన్‌ మైనింగ్‌ ఫామ్‌ను ఏర్పాటు చేయాలని రాజ్‌ కుంద్రా ప్లాన్ చేసినట్లు తెలిపింది. ఈ కాయిన్లు ఇప్పటికీ అతడి వద్ద ఉన్నాయని, ప్రస్తుత మార్కెట్‌ ప్రకారం ఆ కాయిన్స్​ విలువ దాదాపు రూ.150 కోట్లకు పైనే ఉంటుందని వెల్లడించింది. ఈ క్రమంలోనే కేసు దర్యాప్తులో భాగంగా రాజ్‌కుంద్రా ఆస్తులను అటాచ్‌ చేసినట్లు పేర్కొంది.

సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న యూత్​ను బలవంతంగా పోర్న్ వీడియోల్లో నటింపజేశారంటూ రాజ్ కుంద్రాపై గతంలో పోలీస్​ కేసు నమోదైంది. అయితే ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ కోణం కూడా ఉందని తాజా ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ కేసులోకి ఎంటర్ అయినట్లు తెలుస్తోంది.

Raj Kundra And Shilpa Shetty : శిల్పాశెట్టితో విడాకులు కాదు.. మాస్క్​లకే గుడ్​బై.. రాజ్ కుంద్రా పోస్ట్​ల వెనుక ఉద్దేశమిదేనా?

'పోర్నోగ్రఫీ కేసులో నన్ను ఇరికించేందుకు కుట్ర.. న్యాయం చేయండి ప్లీజ్​!'

Last Updated : Apr 18, 2024, 2:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.