ETV Bharat / entertainment

Raj Kundra And Shilpa Shetty : శిల్పాశెట్టితో విడాకులు కాదు.. మాస్క్​లకే గుడ్​బై.. రాజ్ కుంద్రా పోస్ట్​ల వెనుక ఉద్దేశమిదేనా?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 20, 2023, 4:48 PM IST

Raj Kundra And Shilpa Shetty News : నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా.. సోషల్​మీడియాలో పెట్టిన పోస్టులు.. ఆమె అభిమానులను అయోమయంలో పడేశాయి. అయితే రాజ్​ కుంద్రా తాజాగా పెట్టిన మరో పోస్ట్​తో శిల్పా ఫ్యాన్స్​ ఊపిరి పీల్చుకుంటున్నారు. అసలేం జరిగింది? రాజ్​ కుంద్రా పెట్టిన పోస్టులేంటి?

Raj Kundra And Shilpa Shetty
Raj Kundra And Shilpa Shetty

Raj Kundra And Shilpa Shetty News : హీరోయిన్​ శిల్పా శెట్టి భర్త, నటుడు రాజ్​ కుంద్రా పెట్టిన ఓ పోస్ట్ సోషల్​మీడియాలో అలజడి సృష్టించగా.. ఇప్పుడు మరో పోస్ట్​ దానికి క్లారిటీ ఇచ్చినట్లైంది. దీంతో శిల్పా శెట్టి అభిమానులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. అసలేం జరిగిందంటే?

నటుడు రాజ్​కుంద్రా.. సోషల్​మీడియాలో గురువారం అర్ధరాత్రి.. సోషల్​మీడియాలో ఓ పోస్ట్​ పెట్టారు. "మేము విడిపోతున్నాం. దయచేసి ఈ కష్టకాలంలో మాకు సపోర్ట్‌గా నిలవాలని మీ అందరినీ అభ్యర్థిస్తున్నా" అని పోస్ట్‌ చేశారు. దీనికి హార్ట్‌ బ్రేకింగ్‌ ఎమోజీని కూడా జోడించారు. దీంతో శిల్పా శెట్టి- రాజ్ ​కుంద్రా విడాకులు తీసుకుంటున్నట్లు తెగ వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ శిల్పా శెట్టి.. దీని గురించి ఎక్కడ ప్రస్తావించకపోగా.. ఆమె అభిమానులు ఆ వార్తలను కొట్టిపారేశారు.

  • We have separated and kindly request you to give us time during this difficult period 🙏💔

    — Raj Kundra (@onlyrajkundra) October 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదే సమయంలో రాజ్​ కుంద్రా మరో పోస్ట్​ పెట్టారు. "మాస్క్​లకు ఫేర్​వెల్​.. ఇప్పడు వాటితో విడిపోయే సమయం వచ్చింది. గత రెండు సంవత్సరాలుగా నన్ను రక్షించినందుకు ధన్యవాదాలు. నా ప్రయాణం తదుపరి దశ ప్రారంభం #UT69" అని రాసుకొచ్చారు. దీంతో శిల్పాశెట్టి అభిమానులంతా ఊపిరిపీల్చుకున్నారు. రాజ్​ కుంద్రా పెట్టిన పోస్ట్​.. శిల్పా శెట్టితో విడాకులు కాదని.. మాస్కులకు గుడ్​బై చెప్పే ఉద్దేశంలోనే రాజ్‌ కుంద్రా అలా ప్రకటన చేశారని అంటున్నారు. విడాకుల వార్తలపై రాజ్​ కుంద్రా, శిల్పాశెట్టి స్పందిస్తారేమో చూడాలి.

  • Farewell Masks …it’s time to separate now! Thank you for keeping me protected over the last two years. Onto the next phase of my journey #UT69 🙏🎭🥹 🧿😇❤️ pic.twitter.com/svhiGS8aHt

    — Raj Kundra (@onlyrajkundra) October 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వాస్తవానికి రాజ్ కుంద్రా 2022లో పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్‌ అయ్యారు. దాదాపు 2 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపారు. ఆ తర్వాత బయటకు వచ్చిన రాజ్, అప్పటి నుంచి ఎక్కడికెళ్లినా బయట మాస్క్ పెట్టుకునే ఉంటున్నారు. గుమ్మం దాటి బ‌య‌ట‌కు వస్తే చాలు ముఖానికి మాస్క్ పెట్టుకుంటున్నారు. మరోవైపు రాజ్‌ కుంద్రా జీవితం ఆధారంగా UT69 అనే మూవీ వస్తోంది. ఈ సినిమాను షానవాజ్ అలీ ద‌ర్శక‌త్వం వ‌హిస్తుండ‌గా SVS స్టూడియోస్ నిర్మిస్తోంది. ఆయన జైల్లో ఉన్నప్పుడు పడిన మానసిన సంఘర్షణలను ఇందులో చూపనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ ఈవెంట్‌లోనే రాజ్ కుంద్రా త‌న మాస్క్ తీసి క‌నిపించారు. రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి 2009లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.