ETV Bharat / education-and-career

నిరుద్యోగులకు గుడ్ న్యూస్​ - 4187 పోస్టులతో SSC భారీ నోటిఫికేషన్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 10:53 AM IST

SSC sub inspector Jobs 2024
SSC Recruitment 2024

SSC Recruitment 2024 : నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్​. స్టాఫ్ సెలక్షన్ కమిషన్​ (ఎస్​ఎస్​సీ) దిల్లీ పోలీస్​, సెంట్రల్​ ఆర్మ్​డ్​ పోలీస్​ ఫోర్సెస్​ (CAPF)లోని 4187 సబ్​-ఇన్​స్పెక్టర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

SSC Recruitment 2024 : స్టాఫ్​ సెలక్షన్ కమిషన్​ ఈ ఏడాది దిల్లీ పోలీసు, సెంట్రల్​ ఆర్మ్​డ్​ పోలీసు ఫోర్సెస్​ల్లోని సబ్​-ఇన్​స్పెక్టర్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు

  • సెంట్రల్ ఆర్మ్​డ్​ పోలీస్​ ఫోర్సెస్​ : 4001 సబ్​-ఇన్​స్పెక్టర్ (జీడీ)​ పోస్టులు
  • దిల్లీ పోలీస్ (పురుషులు)​ : 125 సబ్​-ఇన్​స్పెక్టర్​ (ఎగ్జిక్యూటివ్​)
  • దిల్లీ పోలీస్ (మహిళలు)​ : 61 సబ్​-ఇన్​స్పెక్టర్​ (ఎగ్జిక్యూటివ్​)
  • మొత్తం పోస్టులు : 4,187

నోట్ : సెంట్రల్​ ఆర్మ్​డ్ ఫోర్సెస్​లో బీఎస్​ఎఫ్​, సీఐఎస్​ఎఫ్​, సీఆర్​పీఎఫ్​, ఐటీబీపీ, ఎస్​ఎస్​బీ ఉంటాయి.

విద్యార్హతలు
అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యా సంస్థలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కూడా కలిగి ఉండాలి.

వయోపరిమితి
అభ్యర్థుల వయస్సు 2024 ఆగస్టు 1 నాటికి 20 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి.
  • మహిళలు, ఎక్స్-సర్వీస్​మెన్​, ఎస్టీ, ఎస్సీలు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక ప్రక్రియ
అభ్యర్థులకు ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి శారీరక దారుఢ్య పరీక్ష (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్​ (పీఎస్​టీ) చేస్తారు. వీటిలోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, అర్హులైన వారిని సబ్​-ఇన్​స్పెక్టర్​ పోస్టులకు ఎంపిక చేస్తారు.

ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పురుషులు)

  • 100 మీటర్ రేస్​ - 16 సెకెన్లు
  • 1.6 కి.మీ రేస్​ - 6.5 నిమిషాలు
  • 3.65 మీటర్స్ లాంగ్​ జంప్​ - 3 ఛాన్సులు
  • 1.2 మీటర్స్ హైజెంప్ - 3 ఛాన్సులు
  • షాట్​ పుట్ (16 Lbs) - 4.5 మీటర్స్​, 3 ఛాన్సులు

ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (మహిళలు)

  • 100 మీటర్ రేస్​ - 18 సెకెన్లు
  • 800 మీ రేస్​ - 4 నిమిషాలు
  • 2.7 మీటర్స్ (9 అడుగులు) లాంగ్​ జంప్​ - 3 ఛాన్సులు
  • 0.9 మీటర్స్ (3 అడుగులు) హైజెంప్ - 3 ఛాన్సులు

జీతభత్యాలు
సబ్​-ఇన్​స్పెక్టర్​లకు నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు జీతం ఉంటుంది.

పరీక్ష కేంద్రాలు

  • ఏపీలోని పరీక్ష కేంద్రాలు : విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, చీరాల, విజయవాడ, నెల్లూరు, కర్నూలు, తిరుపతి
  • తెలంగాణలోని పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్​, వరంగల్​, కరీంనగర్​

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తులు స్వీకరణ ప్రారంభం : 2024 మార్చి 4
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 మార్చి 28
  • దరఖాస్తు సవరణకు అవకాశం : 2024 మార్చి 30, 31 తేదీలు
  • కంప్యూటర్​ బేస్డ్​ టెస్ట్ : మే 9, 10, 13 తేదీలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - RPFలో 4600 ఎస్​ఐ & కానిస్టేబుల్ పోస్టుల భర్తీ - అప్లై చేసుకోండిలా!

క్రియేటివ్ జాబ్స్ చేయాలా? డబ్బులు కూడా బాగా సంపాదించాలా? ఈ టాప్​-5 కెరీర్​ ఆప్షన్స్​పై ఓ లుక్కేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.