ETV Bharat / education-and-career

క్రియేటివ్ జాబ్స్ చేయాలా? డబ్బులు కూడా బాగా సంపాదించాలా? ఈ టాప్​-5 కెరీర్​ ఆప్షన్స్​పై ఓ లుక్కేయండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 5, 2024, 5:06 PM IST

High Paying Creative Jobs 2024 : మీకు క్రియేటివ్ జాబ్స్ చేయడం అంటే చాలా ఇష్టమా? సంప్రదాయ ఉద్యోగాలు అంటే మీకు ఏమాత్రం ఇష్టం లేదా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్, హై పేమెంట్స్​ ఉన్న క్రియేటివ్ కేరీర్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

well paid creative jobs 2024
High paying creative jobs 2024

High Paying Creative Jobs 2024 : ఒకప్పుడు ఎక్కువ మంది సంప్రదాయ ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడేవారు. కానీ నేడు పరిస్థితులు మారాయి. క్రియేటివ్ జాబ్స్​ చేయడానికి యువత ఆసక్తి చూపిస్తున్నారు. తమలోని క్రియేటివిటీని ప్రపంచానికి తెలియజేయాలని ఆశిస్తున్నారు. అందుకే ఈ ఆర్టికల్​లో ప్రస్తుతం బాగా డిమాండ్, హై పేమెంట్స్​ ఉన్న క్రియేటివ్ కెరీర్స్​పై ఓ లుక్కేద్దాం.

క్రియేటివ్ మైండ్స్​
టెక్నాలజీ పెరుగుతున్న కొలదీ క్రియేటివ్ ఫీల్డ్​లో అవకాశాలు బాగా పెరుగుతున్నాయి. గేమింగ్​, ఫిల్మింగ్​, స్టోరీ రైటింగ్​, మార్కెటింగ్​, అడ్వర్టైజింగ్, డిజైనింగ్​, కంటెంట్​ క్రియేటింగ్ లాంటి క్రియేటివ్ జాబ్స్​కు విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. పైగా వీటికి భారీ ఎత్తున పేమెంట్స్ కూడా ఇస్తున్నారు. అందువల్ల మీకు నచ్చిన పనిచేస్తూనే, ఆర్థికంగా బాగా స్థిరపడేందుకు ఇవి సహకరిస్తున్నాయి. అందుకే ఈ ఆర్టికల్​లో టాప్​-5 క్రియేటివ్ కెరీర్స్​ గురించి వివరంగా తెలుసుకుందాం.

1. మార్కెటింగ్​ అండ్ అడ్వర్టైజింగ్​ : ఈ ఫీల్డ్​లో క్రియేటివ్ డైరెక్టర్స్​, బ్రాండ్ మేనేజర్స్​, డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్​లకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ ఫీల్డ్​లో యావరేజ్​గా నెలకు రూ.60,000 వరకు సాలరీ లభిస్తుంది. సోషల్ మీడియా మేనేజర్, ఎస్​ఈఓ స్పెషలిస్ట్​లు అయితే సంవత్సరానికి రూ.5 లక్షల నుంచి రూ.18 లక్షలు వరకు సంపాదిస్తుంటారు.

2. ఫిల్మ్​ అండ్ మీడియా : స్క్రిప్ట్ రైటింగ్, ఫిల్మ్​ డైరెక్షన్​, ప్రొడక్షన్ డిజైనింగ్​, యాక్టింగ్​, ఎడిటింగ్​ చేసేవారికి నేడు మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ ఫీల్డ్​లో మంచి సక్సెస్ సాధించిన వారికి బాగా డబ్బులు వస్తాయి. లేదంటే ఆర్థికంగా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది.

ఉదాహరణకు విక్రాంత్ మెస్సే అనే నటుడు నెలకు సుమారుగా రూ.35 లక్షలు వరకు సంపాదిస్తుంటారు. కానీ బాలీవుడ్​ హీరో సల్మాన్​ఖాన్​ ఒక్కో మూవీకి సుమారుగా రూ.100 కోట్లు వరకు తీసుకుంటాడు. ప్లాప్ హీరోలకు కనీసం ఛాన్స్​లు కూడా రాకపోవచ్చు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి.

3. ఆర్కిటెక్చర్​ అండ్ ఇంటీరియర్​ డిజైనింగ్​ : ఆర్కిటెక్చురల్ ఇంజినీరింగ్, డ్రాఫ్ట్స్​మెన్​, ఇంటీరియర్ డిజైనర్​, కాంట్రాక్టర్స్ ఈ ఫీల్డ్​లో ఉంటారు. వీరికి స్టార్టింగ్ సాలరీ సంవత్సరానికి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటుంది. కానీ మంచి పనితనం, బాగా ఎక్స్​పీరియన్స్ ఉండేవారికి భారీ ఎత్తున పేమెంట్స్ ఉంటాయి.

4. కంటెంట్ క్రియేషన్ : ఈ ఫీల్డ్​లో రైటర్స్​, ఇన్​ఫ్లూయెన్సర్స్​, ఎడిటర్స్​, గ్రాఫిక్ డిజైనర్స్​, ఫొటోగ్రాఫర్స్ ఉంటారు. వీళ్లకు సోషల్ మీడియాలో బాగా ఫాలోయింగ్ ఉంటుంది. అయితే ఎంత పెద్ద సంఖ్యలో సబ్​స్క్రైబర్లు ఉంటారో, అంత పెద్ద ఎత్తున వారికి ఆదాయం వస్తుంది.

ఇన్​స్టాగ్రామ్, యూట్యూబ్​, ఫేస్​బుక్​ లాంటి సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్​లో పనిచేసే సాధారణ కంటెంట్ క్రియేటర్లు సంవత్సరానికి సుమారుగా రూ.1 లక్ష నుంచి రూ.20 లక్షల వరకు ఎర్న్ చేస్తుంటారు. పెద్దపెద్ద ఇన్​ఫ్లూయెన్సర్లు అయితే కోట్లాది రూపాయలు కూడా సంపాదిస్తుంటారు.

5. గేమింగ్​ : నేడు గేమింగ్ డిజైనర్లు, యానిమేటర్లు, స్టోరీ టెల్లర్​లకు మంచి డిమాండ్ ఉంది. సాధారణ గేమ్​ డెవలపర్లు​ సంవత్సరానికి సుమారుగా రూ.4 లక్షలు సంపాదిస్తూ ఉంటారు. కానీ మంచి స్కిల్​, ఎక్స్​పీరియన్స్ ఉన్నవారు చాలా పెద్ద ఎత్తున సంపాదిస్తూ ఉంటారు.

చూశారుగా! నేడు క్రియేటివ్ మైండ్స్​ ఉన్నవారికి మంచి ఛాన్సెస్​ లభిస్తున్నాయి. పైగా భారీ ఎత్తున పేమెంట్స్ కూడా దొరుకుతున్నాయి. మరెందుకు ఆలస్యం! మీకు నచ్చిన రంగంలోకి దూకి, మీ క్రియేటివిటీని ప్రపంచానికి తెలియజేయండి. ఆల్​ ది బెస్ట్!

గూగుల్ బంపర్ ఆఫర్​ - ఉచితంగా ఏఐ కోర్సులు - నేర్చుకుంటే ఉద్యోగం గ్యారెంటీ!

మ్యాథ్స్​ స్టూడెంట్స్​ కోసం సూపర్​ యాప్​ - స్కాన్​ చేస్తే చాలు - సమాధానం వచ్చేస్తుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.