ETV Bharat / business

ఫ్లాట్​గా ముగిసిన స్టాక్ మార్కెట్లు - ఇంట్రాడేలో న్యూ హైస్​ను తాకిన సూచీలు! - Stock Market Today

author img

By ETV Bharat Telugu Team

Published : May 24, 2024, 9:51 AM IST

Updated : May 24, 2024, 11:23 AM IST

Stock Market Today 24th May, 2024 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు రోజంతా ఒడుదొడుకుల్లో కొనసాగి, చివరికి ఫ్లాట్​గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడమే ఇందుకు కారణం.

Share Market Today
Stock Market Today (Getty Images)

Stock Market Close : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు రోజంతా తీవ్రమైన ఒడుదొడుకుల్లో కొనసాగి, చివరికి ఫ్లాట్​గా ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 7 పాయింట్లు నష్టపోయి 75,410 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 10 పాయింట్లు కోల్పోయి 22,957 వద్ద ముగిసింది.

1.10 PM : ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 140 పాయింట్లు లాభపడి 75,554 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 42 పాయింట్లు వృద్ధి చెంది 23,010 వద్ద కొనసాగుతోంది.

12.30 PM : ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 9 పాయింట్లు నష్టపోయి 75,408 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 3 పాయింట్లు వృద్ధి చెంది 22,970 వద్ద కొనసాగుతోంది.

11.20 AM : ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 29 పాయింట్లు లాభపడి 75,445 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 11 పాయింట్లు వృద్ధి చెంది 22,979 వద్ద కొనసాగుతోంది.

Stock Market Today 24th May, 2024 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్రమైన ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. ఎర్లీ ట్రేడింగ్​లో సెన్సెక్స్​ 164 పాయింట్లు లాభపడి 75,582 వద్ద ఆల్​టైమ్​ హై రికార్డ్​ను టచ్ చేసింది. నిఫ్టీ 36 పాయింట్లు వృద్ధి చెంది మొదటిసారి 23,000 మార్క్​ను దాటి, లైఫ్​ టైమ్ ఫీక్​ 23,004ను చేరింది. కానీ తరువాత మదుపరులు క్రమంగా లాభాలు స్వీకరించడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడం వల్ల మార్కెట్లు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 124 పాయింట్లు నష్టపోయి 75,293 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 43 పాయింట్లు కోల్పోయి 22,924 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : ఎల్ అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్​, ఎస్​బీఐ, భారతీ ఎయిర్​టెల్​, విప్రో, టాటా స్టీల్​, టాటా మోటార్స్​
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ​సన్​ఫార్మా, టీసీఎస్​, టైటాన్​, ఐసీఐసీఐ బ్యాంక్​, ఐటీసీ, రిలయన్స్​, ఏసియన్​ పెయింట్స్

ఆసియా మార్కెట్లు
ఏసియన్ మార్కెట్లైన సియోల్​, టోక్యో, షాంఘై, హాంకాంగ్​ అన్నీ నష్టాల్లో ట్రేవడుతున్నాయి. గురువారం వాల్​స్ట్రీట్​ (యూఎస్​ మార్కెట్లు) కూడా నష్టాలతో ముగిసిన విషయం తెలిసిందే.

రూపాయి విలువ
Rupee Open May 24, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 12 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.17గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices May 24, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ముడిచమురు ధర
Crude Oil Prices May 24, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.05 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 81.40 డాలర్లుగా ఉంది.

పసిడి ప్రియులకు వెరీ గుడ్ న్యూస్ - భారీగా దిగివచ్చిన బంగారం, వెండి ధరలు - Gold Rate Today

మీరు ఉద్యోగులా? ITR ఫైల్ చేసేటప్పుడు ఈ 5 విషయాలు మర్చిపోకండి! - Salaried Taxpayer ITR Filing

Last Updated : May 24, 2024, 11:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.