ETV Bharat / business

నెలకో కొత్త కారులో తిరగాలా? అయితే 'సబ్​స్క్రిప్షన్​​ ప్యాకేజీ'ల గురించి తెలుసుకోండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 11, 2024, 4:05 PM IST

How To Get Car Subscription : మీకు కార్లు అంటే చాలా ఇష్టమా? కానీ వాటిని కొనేంత స్తోమత లేదా? అయినా ఫర్వాలేదు. మీకు నచ్చిన కారును కోరుకున్నంత కాలం పాటు వాడుకునేందుకు ఒక అవకాశం ఉంది. అదే కార్​ సబ్​స్క్రిప్షన్ ప్లాన్​. మరి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామా?

How to get car subscription in India
what is car subscription

How To Get Car Subscription : మనలో చాలా మందికి కార్లు అంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ కారు కొనేంత స్తోమత వారికి ఉండదు. ఇలాంటి వారి కోసమే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు సబ్​స్క్రిప్షన్ ప్లాన్​లను అందిస్తున్నాయి. వీటి ద్వారా మీకు నచ్చిన కారును నిర్దిష్ట కాలం పాటు వాడుకోవచ్చు. దీని కోసం మీరు ప్రతినెలా నిర్దిష్ట మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది. ఇది ఏదో చాలా బాగుంది కదూ. మీరు కనుక కార్​ లవర్​ అయితే, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, నెలకో కొత్త కారులో హాయిగా తిరగవచ్చు.

డిపాజిట్ ఎంత చేయాలి?
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ కార్​ సబ్​స్క్రిప్షన్ ప్లాన్​లను అందిస్తున్నాయి. మీరు ఎంచుకునే మోడల్​ ఆధారంగా ఈ డిపాజిట్ మొత్తం మారుతుంది. అయితే కార్​ సబ్​స్క్రైబ్​ చేసుకోవడానికి ముందుగా కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. లేదా డౌన్ పేమెంట్ చెల్లించాల్సి వస్తుంది. తరువాత మీరు కోరుకున్నంత కాలానికి నెలనెలా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంతే సింపుల్​.

కార్ సబ్​స్క్రిప్షన్ బెనిఫిట్స్​!
మీకు నచ్చిన కారును సబ్​స్క్రైబ్ చేసుకోవచ్చు. దీనిని మీకు నచ్చినప్పుడు వదులుకోవచ్చు కూడా. కార్​ సబ్​స్క్రైబ్ చేసుకున్న తరువాత మీకు రోడ్​ సైడ్ అసిస్టెన్స్ లభిస్తుంది. మీరు ప్రస్తుతం వాడుతున్న మోడల్​ను వదులుకొని, కొత్త మోడల్​కు అప్​గ్రేడ్ చేసుకోవడానికి వీలవుతుంది.

కారు మెయింటెనెన్స్​, ఇన్సూరెన్స్​, ట్యాక్స్​లు అన్నీ మీరు చెల్లించే నెలవారీ సభ్యత్వ రుసుములోనే కవర్ అయిపోతాయి. కనుక ఎక్స్​ట్రా ఫీజు కట్టాల్సిన పని ఉండదు. యూఎస్​, యూరోప్​ల్లో ఇది బాగా పాపులర్ అయ్యింది. ఇండియాలో కూడా ఈ కార్​ సబ్​స్క్రిప్షన్ ప్లాన్ క్రమంగా ప్రాచుర్యం పొందుతోంది.

Car Subscription Vs Car Loan

కార్​ సబ్​స్క్రిప్షన్​ : సింపుల్​గా చెప్పాలంటే, కారును నెలవారీగా అద్దెకు తీసుకోవడాన్ని కార్ సబ్​స్క్రిప్షన్ అని అంచారు. మీరు నెలవారీగా చెల్లించే రుసుములోనే కారు నిర్వహణ ఖర్చులు కవర్​ అయిపోతాయి. మీకు అయ్యే అదనపు ఖర్చులు - పెట్రోల్​/డీజిల్​, క్లీనింగ్ ఛార్జీలు మాత్రమే. పైగా మీరు తక్కువ దూరాలు మాత్రమే ప్రయాణిస్తే, సబ్​స్క్రిప్షన్ ఛార్జీలు కూడా బాగా తగ్గుతాయి. ఎలా అంటే, మీరు ప్రతినెలా ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తారో ముందే చెప్పి, తక్కువ ధరకే సబ్​స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవచ్చు. మీరు కనుక ఎలక్ట్రిక్ కారును సబ్​స్క్రైబ్ చేసుకుంటే తెల్లని బోర్డ్​పై నల్లని అక్షరాలతో కార్​ ప్లేట్ ఇస్తారు. లేదా పచ్చని బోర్డ్​పై తెల్లని అక్షరాలు ఉండే కార్​ ప్లేట్ ఇస్తారు.

కార్​ లోన్​ : కార్​ లోన్ అనేది చాలా పెద్ద తతంగం. మీరు బ్యాంకులకు ష్యూరిటీ ఇచ్చి రుణాలు తీసుకోవాల్సి ఉంటుంది. డీలర్​లకు మొత్తం డబ్బులు ఇచ్చి కారును కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల మీపై ఒకేసారి పెద్ద ఎత్తున ఆర్థిక భారం పడుతుంది. పైగా బ్యాంకులకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. లేటెస్ట్ మోడల్​ కార్లకు అప్​గ్రేడ్ కావడం కూడా కష్టమవుతుంది. పైగా ఇన్సూరెన్స్​, మెయింటెనెన్స్​, రోడ్ సైడ్ అసిస్టెన్స్​, టాక్స్​ల భారం కూడా మీదే పడుతుంది.

భారతదేశంలో కార్ సబ్​స్క్రిప్షన్ తీసుకోవడం ఎలా?
ఇండియాలో కార్​ సబ్​స్క్రైబ్ చేసుకోవాలంటే పాన్ కార్డ్​, ఆధార్​ కార్డ్​, డ్రైవింగ్ లైసెన్స్​, ఇన్​కం ప్రూఫ్ అన్నీ సమర్పించాల్సి ఉంటుంది. ప్రైవేట్ కొనుగోలుదారుగా/ బిజినెస్ ఓనర్​గా సబ్​స్క్రిప్షన్ తీసుకుంటే మీ బ్యాంక్ స్టేట్​మెంట్​లు, ఐటీ రిటర్నులు చూపించాల్సి ఉంటుంది. ఒక వేళ కంపెనీ పేరు మీదుగా తీసుకుంటే, సదరు కంపెనీకి చెందిన గత ఆరు నెలల లాభ, నష్టాల స్టేట్​మెంట్​ను కూడా సమర్పించాల్సి ఉంటుంది.

కార్​ సబ్​స్క్రిప్షన్ ప్యాకేజ్​లో ఏమేమి ఉంటాయి?
కార్ సబ్​స్క్రిప్షన్ ప్యాకేజీలో చాలా వరకు గవర్నమెంట్ పేమెంట్స్, రోడ్ సైడ్​ అసిస్టెన్స్​, సర్వీస్​ ప్యాకేజీలు, ముందస్తు లీజ్​ ముగింపునకు సంబంధించిన క్లాజ్​లు ఉంటాయి. ఒక వేళ నిర్దిష్ట పరిమితికి మించి ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణిస్తే, అందుకు అదనపు ఛార్జీలు కూడా చెల్లించాల్సి వస్తుంది.

Car Subscription Vs Car Rental
కార్ సబ్​స్క్రిప్షన్ అనేది నెలవారీగా ఉంటుంది. దీనికి ముందుగానే నిర్దిష్ట మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. కార్ రెంటల్​ అనేది తక్షణ అవసరాల కోసం ఉపయోగపడే పద్ధతి. అంటే ట్రావెల్ ఏజెన్సీ నుంచి కారును అద్దెకు తీసుకుని స్వల్పకాలానికి వాడుకోవచ్చు. సాధారణంగా కొన్ని రోజులు లేదా కొన్ని వారాల ప్రయాణాల కోసం కారును అద్దెకు తీసుకుంటూ ఉంటారు. కార్ సబ్​స్క్రిప్షన్​తో పోలిస్తే, అద్దెకు తీసుకున్న కారుకు ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది.

ఇండియాలో కార్​ సబ్​స్క్రిప్షన్ ప్లాన్స్ అందిస్తున్న ఆటోమొబైల్ కంపెనీలు ఏవి?
భారత్​లో ప్రధానంగా మారుతి సుజుకి, మహీంద్రా, హ్యుందాయ్​, ఎమ్​జీ, నిస్సాన్​, టయోటా కంపెనీలు కార్​ సబ్​స్క్రిప్షన్ ప్యాకేజీలను అందిస్తున్నాయి.

రూ.2 లక్షల్లో మంచి బైక్​ కొనాలా? టాప్​-10 పవర్​ఫుల్​ మోడల్స్​ ఇవే!

టాటా, మారుతి కార్లపై భారీ ఆఫర్స్​ - ఆ మోడల్​పై ఏకంగా రూ.1.53 లక్షలు డిస్కౌంట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.