ETV Bharat / business

రూ.2 లక్షల్లో మంచి బైక్​ కొనాలా? టాప్​-10 పవర్​ఫుల్​ మోడల్స్​ ఇవే!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 10, 2024, 3:37 PM IST

Best Bikes Under 2 Lakh : మీరు కొత్త బైక్ కొనాలని అనుకుంటున్నారా? రూ.2 లక్షల వరకు బడ్జెట్ పెట్టగలరా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో సూపర్ స్టైలిష్​ లుక్స్​తో, బెస్ట్ పెర్ఫార్మెన్స్, రైడింగ్ ఎక్స్​పీరియన్స్​ ఇచ్చే టాప్​-10 బైక్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

Top 10 Bikes Under 2 Lakh
Best Bikes Under 2 Lakh

Best Bikes Under 2 Lakh : ఇండియాలో బైక్స్​కు ఎంత క్రేజ్​ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ యువతను ఆకర్షించేందుకు సూపర్​ స్టైలిష్​ లుక్స్​తో, బెస్ట్ పెర్ఫార్మెన్స్, రైడింగ్ ఎక్స్​పీరియన్స్​ ఇచ్చే బైక్​లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. వాటిలో రూ.2 లక్షల బడ్జెట్లోని టాప్​-10 బైక్​ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. KTM 200 Duke : స్పోర్టీ బైక్​ కొనాలని ఆశించేవారికి కేటీఎం 200 డ్యూక్​ మంచి ఆప్షన్ అవుతుంది. దీనిలో 199.5 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 25 పీఎస్​ పవర్​ జనరేట్ చేస్తుంది. దీని మైలేజీ 35 కి.మీ/లీటర్​. ఈ బైక్​ సూపర్ రైడింగ్ ఎక్స్​పీరియన్స్ ఇస్తుంది. మార్కెట్​లో ఈ కేటీఎం డ్యూక్ ధర సుమారుగా రూ.1.93 లక్షలు ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

2. Bajaj Pulsar NS200 : బజాజ్ కంపెనీ రిలీజ్ చేసిన బీస్ట్​ మోడల్ ఈ పల్సర్​ ఎన్​ఎస్​200. ఇది మంచి డైనమిక్​, స్పోర్టీ లుక్​ కలిగి ఉంటుంది. దీనిలో 199.5 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్ అమర్చారు. ఇది 24.5 పీఎస్ పవర్ జనరేట్ చేస్తుంది. దీనిపై లీటర్ పెట్రోల్​తో 40.36 కి.మీ ప్రయాణించవచ్చు. మార్కెట్​లో దీని ధర సుమారుగా రూ.1.49 లక్షలు ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

3. Royal Enfield Classic 350 : రాయల్ ఎన్​ఫీల్డ్ బైక్​లకు ఇండియన్ మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. అందులో బెస్ట్ సెల్లింగ్ మోడల్ రాయల్ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350. ఈ ఛార్మింగ్​ బైక్​లో 349 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉంది. దీని మైలేజ్​ 30-37 km/l. ఇది 5 వేరియంట్లలో 12 రంగుల్లో లభిస్తుంది. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.1.93 లక్షలు ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

4. Yamaha R-15 V4 : మంచి రైడింగ్ ఎక్స్​పీరియన్స్ కావాలని ఆశించేవారికి ఈ యమహా ఆర్​-15 వీ4 బైక్ మంచి ఆప్షన్ అవుతుంది. ఈ బైక్​లో 155 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్​ ఉంది. ఇది 18.1 bhp పవర్​ జనరేట్ చేస్తుంది. ఈ యమహా బైక్ మైలేజ్​ 55.20 కి.మీ/లీటర్​. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.1.82 లక్షలు ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

5. Honda CB200X : క్రేజీ లైఫ్​ అడ్వెంచర్స్ కోరుకునే వారికి హోండా సీబీ200 ఎక్స్​ బైక్ చాలా బాగుంటుంది. దీనిలో 184.4 సీసీ సామర్థ్యం గల ఇంజిన్ ఉంది. ఈ బైక్​పై లీటర్ పెట్రోల్​తో 40 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. మార్కెట్లో ఈ బైక్ ధర సుమారుగా రూ.1.46 లక్షలు ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

6. Honda Hornet 2.0 : స్టైలిష్ లుక్స్​తో, బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే బైక్​ల్లో హోండా హార్నెట్​ 2.0 ఒకటి. దీనిలో 184.4సీసీ సామర్థ్యం కలిగిన BS6-కంప్లైంట్​ పవర్​ట్రైన్ ఉంది. ఇది 17.26 పీఎస్ పవర్ జనరేట్ చేస్తుంది. దీని మైలేజ్​ 57.35 కి.మీ/లీటర్​. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.1.39 లక్షలు ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

7. Bajaj Avenger 220 Street : ఈ బజాజ్ అవెంజర్​ 220 స్ట్రీట్ బైక్ క్రూయిజ్ స్టైల్​ కలిగి ఉంటుంది. దీనిలో 200 సీసీ ఆయిల్​-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఈ బైక్ మైలేజ్​ 40 కి.మీ/లీటర్.​ ఇది సింగిల్​-ఛానల్​ ఏబీఎస్​, కంఫర్టబుల్​ వైడ్​ సీట్లను కలిగి ఉంటుంది. యూనిక్ రైడింగ్ ఎక్స్​పీరియన్స్ కావాలని అనుకునేవారు ఈ బజాజ్​ అవెంజర్​ 220 స్ట్రీట్​ బైక్​ను ఎంచుకోవచ్చు.​ మార్కెట్లో ఈ బైక్ ధర సుమారుగా రూ.1.43 లక్షలు ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

8. Suzuki Gixxer SF 250 : సుజుకి కంపెనీ విడుదల చేసిన పవర్​ఫుల్​ బైక్​ ఈ గిక్సర్​ ఎస్​ఎఫ్​ 250. దీనిలో 249 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉంది. దీనిపై లీటర్​ పెట్రోల్​తో 38.5 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. ఇది స్టైలిష్ లుక్స్​తో, రైడింగ్ చేయడానికి మంచి కంఫర్ట్​గా ఉంటుంది. మార్కెట్లో ఈ బైక్ ధర సుమారుగా రూ.1.92 లక్షలు ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

9. Yamaha MT 15 : ఆఫ్​-బీట్​ అపీల్​తో యమహా ఎంటీ 15 యూత్​ను ఇట్టే ఆకర్షిస్తుంది. ఈ బైక్​లో 155 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉంది. ఇది 18.4 పీఎస్​ పవర్​ జనరేట్ చేస్తుంది. ఈ యమహా బైక్​ మైలేజ్​ 56.87kmpl. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.1.36 లక్షలు ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

10. Oben Rorr : ఈ ఒబెన్​ రోర్ అనేది ఒక ఎలక్ట్రిక్ బైక్​. భారతదేశంలో లాంగెస్ట్​ రేంజ్ కలిగి ఈవీ బైక్​ ఇదే. దీనిలో 1000 వాట్​ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంది. దీనితో 200 కి.మీ రేంజ్​ వరకు ప్రయాణించవచ్చు. దీనిలో కటింగ్-ఎడ్జ్​ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. మంచి ఎకో-ఫ్రెండ్లీ బైక్​ కొనాలని అనుకునేవారికి ఈ ఒబెన్ రోర్ బైక్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర సుమారుగా రూ.1.49 లక్షలు ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

టాటా, మారుతి కార్లపై భారీ ఆఫర్స్​ - ఆ మోడల్​పై ఏకంగా రూ.1.53 లక్షలు డిస్కౌంట్​!

రూ.70,000 బడ్జెట్లో మంచి బైక్​ కొనాలా? ఈ టాప్​-5 మోడల్స్​పై ఓ లుక్కేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.