ETV Bharat / business

గుడ్ న్యూస్​ - భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 13, 2024, 9:18 AM IST

Updated : Mar 13, 2024, 10:17 AM IST

Gold Price Today March 13th 2024
Gold Rate Today March 13th 2024

Gold Rate Today March 13th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today March 13th 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా తగ్గాయి. మంగళవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.67,857 ఉండగా, బుధవారం నాటికి రూ.502 తగ్గి రూ.67,355కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.74,994 ఉండగా, బుధవారం నాటికి రూ.584 తగ్గి రూ.74,410కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad March 13th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.67,355గా ఉంది. కిలో వెండి ధర రూ.74,410గా ఉంది.
  • Gold Price In Vijayawada March 13th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.67,355గా ఉంది. కిలో వెండి ధర రూ.74,410గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam March 13th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.67,355గా ఉంది. కిలో వెండి ధర రూ.74,410గా ఉంది.
  • Gold Price In Proddatur March 13th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.67,355గా ఉంది. కిలో వెండి ధర రూ.74,410గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price March 13th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్​​ రేట్లు తగ్గాయి. మంగళవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్ ధర​ 2178 డాలర్లు ఉండగా, బుధవారం నాటికి 18 డాలర్లు​ తగ్గి 2160 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 24.15 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News March 13th 2024 : బుధవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.58,56,056
ఇథీరియంరూ.3,25,000
టెథర్రూ.82.79
బైనాన్స్ కాయిన్రూ.42,050
సొలోనా రూ.12,361

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today March 13th 2024 : బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. విదేశీ పెట్టుబడులు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 124 పాయింట్లు లాభపడి 73,792 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 7 పాయింట్లు వృద్ధి చెంది 22,342 వద్ద కొనసాగుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : ఐటీసీ, నెస్లే ఇండియా, విప్రో, టీసీఎస్​, ఐసీఐసీఐ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఇన్ఫోసిస్

నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : పవర్​గ్రిడ్​, ఎన్​టీపీసీ, టాటా స్టీల్​, భారతీ ఎయిర్​టెల్​, టాటా మోటార్స్​, యాక్సిస్ బ్యాంక్​, మారుతి సుజుకి

రూపాయి విలువ
Rupee Open March March 13th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 5 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.85గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices March 13th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడిచమురు ధర
Crude Oil Prices March 13th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.50 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 82.33 డాలర్లుగా ఉంది.

గుడ్​ న్యూస్​ - ఆధార్‌ ఫ్రీ అప్‌డేట్‌ గడువు మళ్లీ పొడిగింపు - కొత్త డేట్ ఇదే!

స్మాల్​​/ మిడ్​ క్యాప్​ స్టాక్స్​లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? జర జాగ్రత్త - ఎందుకంటే?

Last Updated :Mar 13, 2024, 10:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.