ETV Bharat / business

'దేశాన్ని విడిచి వెళ్లనీయొద్దు' బైజూస్​ రవీంద్రన్​పై ఈడీ లుక్ ​అవుట్​ నోటీసులు

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 22, 2024, 11:10 AM IST

Updated : Feb 22, 2024, 12:23 PM IST

ED Look Out Notice To BYJUs Founder
ED Look Out Notice To BYJUs Founder

BYJUs Raveendran ED : బైజూస్​ ఫౌండర్​ రవీంద్రన్​పై లుక్​ అవుట్​ నోటీసులు జారీ చేశారు ఈడీ అధికారులు. ఆయన దేశం విడిచి వెళ్లకుండా చూడాలని సంబంధిత వర్గాలను ఈడీ కోరింది.

BYJUs Raveendran ED : ప్రముఖ ఎడ్యూటెక్‌ సంస్థ బైజూస్​ వ్యవస్థాపకుడు​, సీఈఓ రవీంద్రన్​పై లుక్​ అవుట్​ నోటీసులు జారీ చేసింది ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ). ఆయన దేశం విడిచి వెళ్లకుండా చూడాలని ఇమ్మిగ్రేషన్​ బ్యూరో అధికారులను ఈడీ కోరింది. కాగా, హై-స్టేక్స్​ ఎక్స్‌ట్రార్డినరీ జనరల్​ మీటింగ్​కు ఒకరోజు ముందు ఈడీ ఈ నోటీసులు జారీ చేయడం గమనార్హం. శుక్రవారం జరగనున్న ఈ సమావేశంలో కొంతమంది పెట్టుబడిదారులు రవీంద్రన్‌ను ప్రస్తుతం కొనసాగుతున్న పదవిలో నుంచి బర్తరఫ్​ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.

'ఎటువంటి తీర్మానాలను ఆమోదించవద్దు'
ఈజీఎం సమయంలో ఎటువంటి తీర్మానాలను ఆమోదించవద్దని, తుది విచారణ వరకు వేచి ఉండాలిని బుధవారం కర్ణాటక హైకోర్టు బైజూస్​ వాటాదారులను కోరింది. షేర్​హోల్డర్ల సమావేశం నిర్వహించకుండా చూడాలని బైజూస్​ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. అయితే ఈజీఎం నిర్వహణపై న్యాయమూర్తి స్టే ఇవ్వకుండానే తదుపరి విచారణను మార్చి 13కు వాయిదా వేశారు.

విచారణకు గైర్హాజరు
ED Notice To BYJUs Founder : గతేడాది ఏప్రిల్​లో బెంగళూరులోని రవీంద్రన్​కు చెందిన రెండు కార్యాలయాలతో పాటు ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు. ఫెమా నిబంధనల ప్రకారం సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలతో పాటు డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకున్నారు. కొందరు బయట వ్యక్తుల ద్వారా వచ్చిన వివిధ ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నామని అప్పట్లో ఈడీ తెలిపింది. కాగా, ఇప్పటికే రవీంద్రన్​కు పలుమార్లు ఈడీ సమన్లు జారీ చేసినా ఆయన విచారణకు హాజరు కాలేదని అధికారులు చెప్పారు.

ఇదీ కేసు
2011-2023లో బైజూస్​ దాదాపు రూ.28,000 కోట్ల మేరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అందుకుందని తనిఖీల్లో బయటపడిందని ఈడీ పేర్కొంది. అదే సమయంలో రూ.9,754 కోట్లను వివిధ దేశాలకు బైజూస్​ బదిలీ చేసినట్లు ఆధారాలు లభించాయని అధికారులు తెలిపారు. అయితే ఇందులో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని, ఫెమా చట్టాన్ని ఉల్లంఘించి రవీంద్రన్​ ఈ నిధులను స్వీకరించారని తమకు ఫిర్యాదులు అందాయని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ వెల్లడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి బైజూస్​ కంపెనీ ఆర్థిక లావాదేవీలను వెల్లడించలేదని, ఖాతాలను ఆడిటింగ్‌ కూడా చేయించలేదని వివరించింది.

హెల్త్​ ఇన్సూరెన్స్​ పోర్టింగ్​ రిక్వెస్ట్​ రిజెక్ట్​ అయిందా? అసలు కారణాలు ఇవే!

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు- హైదరాబాద్​, విజయవాడలో ఎంతంటే?

Last Updated :Feb 22, 2024, 12:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.