ETV Bharat / business

ట్యాక్సీ/క్యాబ్ బిజినెస్ చేయాలా? మంచి మైలేజ్ ఇచ్చే టాప్​-10 కార్స్ ఇవే!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 6, 2024, 4:02 PM IST

Best Cars for Cabs Business
Best Cars for Taxi Business

Best Cars For Taxi And Cabs Business In Telugu : మీరు ట్యాక్సీ/ క్యాబ్ బిజినెస్​​ కోసం మంచి కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో రూ.5 లక్షలు నుంచి రూ.20 లక్షల రేంజ్​లో ఉన్న టాప్​-10 కార్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

Best Cars For Taxi And Cabs Business : భారతదేశంలో ట్యాక్సీ, క్యాబ్​, కమర్షియల్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. ప్రజలను గమ్యస్థానానికి చేరుస్తూ, స్వయం ఉపాధి పొందడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఈ ట్యాక్సీ లేదా క్యాబ్​లు మంచి బూట్ స్పేస్ కలిగి ఉండి, ఎక్కువ మైలేజ్ ఇచ్చేవిగా ఉండాలి. అందుకే ఈ ఆర్టికల్​లో రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల బడ్జెట్ రేంజ్​లో లభిస్తున్న టాప్​-10 కార్ల గురించి తెలుసుకుందాం.

1. Maruti Suzuki Celerio Features : ఈ మారుతి సుజుకి సెలెరియో ఒక ఎంట్రీ లెవెల్​ హ్యాచ్​బ్యాక్​. తక్కువ బడ్జెట్లో మంచి పెర్ఫార్మెన్స్, సూపర్ కంఫర్ట్​ ఇచ్చే కారు ఇది.

  • మైలేజ్​ : 24.97 కి.మీ - 34.43 కి.మీ
  • ఫ్యూయెల్ టైప్​ : పెట్రోల్​/ సీఎన్​జీ
  • బూట్ స్పేస్​ : 313 లీటర్స్​
  • ఇంజిన్​ : 998 సీసీ
  • ట్రాన్స్​మిషన్​ : మాన్యువల్​/ ఆటోమేటిక్
  • సీట్​ కెపాసిటీ : 5
  • ఎయిర్​బ్యాగ్స్​ : 2
  • సేఫ్టీ ఫీచర్స్ : ఏబీఎస్​ విత్ ఈబీడీ, హిల్​ హోల్డ్​ అసిస్ట్​, సుజుకి కనెక్ట్​, హార్టెక్ట్ ప్లాట్​ఫాం​

Maruti Suzuki Celerio Price : మార్కెట్లో ఈ మారుతి సుజుకి సెలెరియో కారు ధర సుమారుగా రూ.5.36 లక్షల వరకు ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

2. Maruti Suzuki WagonR Features : మంచి 'టాల్ బాయ్​' డిజైన్​తో వచ్చే హ్యాచ్​బ్యాక్ కారు ఇది. దీనిలో 7-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్​ సిస్టమ్​ సహా, బోలెడు మంచి ఫీచర్స్​ ఉన్నాయి.

  • మైలేజ్​ : 23.56 కి.మీ - 25.19 కి.మీ
  • ఫ్యూయెల్ టైప్​ : పెట్రోల్​/ సీఎన్​జీ
  • బూట్ స్పేస్​ : 341 లీటర్స్​
  • ఇంజిన్​ : 1197 సీసీ
  • ట్రాన్స్​మిషన్​ : మాన్యువల్​/ ఆటోమేటిక్
  • సీట్​ కెపాసిటీ : 5
  • ఎయిర్​బ్యాగ్స్​ : 2
  • సేఫ్టీ ఫీచర్స్ : ఏబీఎస్​ విత్ ఈబీడీ, హిల్​ హోల్డ్​ అసిస్ట్​, డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్​బ్యాగ్స్​, రియర్ పార్కింగ్ సెన్సార్స్​.

Maruti Suzuki WagonR Price : మార్కెట్లో ఈ మారుతి సుజుకి వ్యాగన్ఆర్​ కారు ధర సుమారుగా రూ.5.545 లక్షలు ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

3. Tata Tiago Features : ట్యాక్సీ బిజినెస్ చేయాలని అనుకునేవారికి ఈ టాటా టియాగో బెస్ట్ ఆప్షన్ అవుతుంది. స్పోర్టీ డిజైన్​తో, నెక్ట్స్​ జెన్ టెక్నాలజీతో ఇది వస్తుంది. సిటీల్లో డ్రైవ్ చేయడానికి ఇది బ్రహ్మాండంగా ఉంటుంది.

  • మైలేజ్​ : 20 కి.మీ
  • ఫ్యూయెల్ టైప్​ : పెట్రోల్​/ సీఎన్​జీ
  • బూట్ స్పేస్​ : 242 లీటర్స్​
  • ఇంజిన్​ : 1199 సీసీ
  • ట్రాన్స్​మిషన్​ : మాన్యువల్​/ ఆటోమేటిక్
  • సీట్​ కెపాసిటీ : 5
  • ఎయిర్​బ్యాగ్స్​ : 2
  • సేఫ్టీ ఫీచర్స్ : ఏబీఎస్​ విత్ ఈబీడీ, డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్​బ్యాగ్స్​, రియర్ పార్కింగ్ సెన్సార్స్​, కార్నరింగ్​ స్టెబిలిటీ కంట్రోల్​.

Tata Tiago Price : మార్కెట్లో ఈ టాటా టియాగో కారు ధర సుమారుగా రూ.5.60 లక్షల వరకు ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

4. Hyundai Aura Features : క్యాబ్ రైడర్లకు ఈ హ్యుందాయ్​ ఆరా కారు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ సెడాన్​ కారు లోపల విశ్రాంతిగా కాలు చాపుకోవడానికి అనువుగా యాంపుల్ లెగ్​రూమ్ ఉంటుంది.

  • మైలేజ్​ : 17 కి.మీ - 28.1 కి.మీ
  • ఫ్యూయెల్ టైప్​ : పెట్రోల్​/ డీజిల్​/ సీఎన్​జీ
  • బూట్ స్పేస్​ : 402 లీటర్స్​
  • ఇంజిన్​ : 1197 సీసీ
  • ట్రాన్స్​మిషన్​ : మాన్యువల్​/ ఆటోమేటిక్
  • సీట్​ కెపాసిటీ : 5
  • ఎయిర్​బ్యాగ్స్​ : 6
  • సేఫ్టీ ఫీచర్స్ : ఏబీఎస్​ విత్ ఈబీడీ, బర్గులర్ అలారమ్​, రియర్ కెమెరా విత్ డిస్​ప్లే ఆన్ ఆడియో, హిల్ స్టార్ట్​ అసిస్ట్ కంట్రోల్ (HAC), ఎలక్ట్రానిక్​ స్టెబిలిటీ కంట్రోల్ (ESC).

Hyundai Aura Price : మార్కెట్లో ఈ హ్యుందాయ్​ ఆరా కారు ధర సుమారుగా రూ.6.43 లక్షలు ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

5. Maruti Suzuki Dzire Features : మంచి ప్యూయెల్ ఎఫీషియెన్సీ, సూపర్ పెర్ఫార్మెన్స్​, బెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ ఉండే కారు కొనాలని ఆశించేవారికి మారుతి సుజుకి డిజైర్ బెస్ట్ ఛాయిస్ అవుతుంది.

  • మైలేజ్​ : 24.12 కి.మీ
  • ఫ్యూయెల్ టైప్​ : పెట్రోల్​/ సీఎన్​జీ
  • బూట్ స్పేస్​ : 378 లీటర్స్​
  • ఇంజిన్​ : 1197 సీసీ
  • ట్రాన్స్​మిషన్​ : మాన్యువల్​/ ఆటోమేటిక్
  • సీట్​ కెపాసిటీ : 5
  • ఎయిర్​బ్యాగ్స్​ : 2
  • సేఫ్టీ ఫీచర్స్ : డ్యూయెల్ ఎయిర్​బ్యాగ్స్​, యాంటీ-థెఫ్ట్​ సెక్యూరిటీ సిస్టమ్​, స్పీడ్​-సెన్సిటివ్​ డోర్​ లాకింగ్, హార్టెక్ట్​ ప్లాట్​ఫాం, ఎలక్ట్రానిక్​ స్టెబిలిటీ ప్రోగ్రామ్​ విత్ హిల్​ హోల్డ్, ఏబీఎస్​, క్రాష్ వార్నింగ్​

Maruti Suzuki Dzire Price : మార్కెట్లో ఈ మారుతి సుజుకి డిజైర్ కారు ధర సుమారుగా రూ.6.51 లక్షలు ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

6. Honda Amaze Features : తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులతో, మంచి కంఫర్ట్​గా ప్రయాణించడానికి హోండా అమేజ్​ చాలా బాగుంటుంది. ముఖ్యంగా మంచి ప్యూయెల్ ఎఫీషియన్సీ కలిగి, ట్యాక్సీ నడపడానికి అనువుగా ఉంటుంది.

  • మైలేజ్​ : 18.6 కి.మీ - 24.7 కి.మీ
  • ఫ్యూయెల్ టైప్​ : పెట్రోల్​/ డీజిల్​
  • బూట్ స్పేస్​ : 420 లీటర్స్​
  • ఇంజిన్​ : 1199 సీసీ
  • ట్రాన్స్​మిషన్​ : మాన్యువల్​/ ఆటోమేటిక్
  • సీట్​ కెపాసిటీ : 5
  • ఎయిర్​బ్యాగ్స్​ : 2
  • సేఫ్టీ ఫీచర్స్ : హోండా కనెక్ట్​, ఆటో ఎల్​ఈడీ ప్రొజెక్టర్ హెడ్​ల్యాంప్స్​, ఈసీయూ ఇమ్మొబిలైజర్​ సిస్టమ్, రియర్ పార్కింగ్ కెమెరా అండ్ సెన్సార్స్​, ఏబీఎస్ విత్ ఈబీడీ

Honda Amaze Price : మార్కెట్లో ఈ హోండా అమేజ్ కారు ధర సుమారుగా రూ.7.09 లక్షలు ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

7. Maruti Suzuki Ciaz Features : ఈ మారుతి సుజుకి సియాజ్ కారులో టీఎఫ్​టీ మల్టీ-ఇన్ఫర్మేషన్​ డిస్​ప్లే (MID) సహా పలు సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. అత్యంత భద్రంగా ట్యాక్సీ/ క్యాబ్ నడపాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

  • మైలేజ్​ : 20.04 కి.మీ - 20.65 కి.మీ
  • ఫ్యూయెల్ టైప్​ : పెట్రోల్​/ డీజిల్​
  • బూట్ స్పేస్​ : 510 లీటర్స్​
  • ఇంజిన్​ : 1462 సీసీ
  • ట్రాన్స్​మిషన్​ : మాన్యువల్​/ ఆటోమేటిక్
  • సీట్​ కెపాసిటీ : 5
  • ఎయిర్​బ్యాగ్స్​ : 2
  • సేఫ్టీ ఫీచర్స్ : యాంటీ థెఫ్ట్​ సెక్యూరిటీ సిస్టమ్, నెక్సా సేఫ్టీ షీల్డ్​, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ విత్ హిల్​ హోల్డ్​ ఫంక్షన్​

Maruti Suzuki Ciaz Price : మార్కెట్లో ఈ మారుతి సుజుకి సియాజ్ కారు ధర సుమారుగా రూ.9.30 లక్షలు ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

8. Maruti Suzuki Ertiga Features : డైనమిక్ లుక్స్​తో, మంచి సేఫ్టీ ఫీచర్లు ఉన్న కారు ఈ మారుతి సుజుకి ఎర్టిగా. ట్యాక్సీ బిజినెస్ చేయడానికి ఇది చాలా బాగుంటుంది.

  • మైలేజ్​ : 17.99 కి.మీ - 26.2 కి.మీ
  • ఫ్యూయెల్ టైప్​ : పెట్రోల్​/ డీజిల్​/ సీఎన్​జీ
  • బూట్ స్పేస్​ : 209 లీటర్స్​
  • ఇంజిన్​ : 1462 సీసీ
  • ట్రాన్స్​మిషన్​ : మాన్యువల్​/ ఆటోమేటిక్
  • సీట్​ కెపాసిటీ : 7
  • ఎయిర్​బ్యాగ్స్​ : 2 - 4
  • సేఫ్టీ ఫీచర్స్ : సుజుకి కనెక్ట్​, ఏబీఎస్ విత్ ఈబీడీ, బ్రేక్ అసిస్ట్​, హార్టెక్ట్ ప్లాట్​ఫాం, హిల్ హోల్డ్​, స్పీడ్ సెన్సిటివ్ ఆటో డోర్ లాక్​​

Maruti Suzuki Ertiga Price : మార్కెట్లో ఈ మారుతి సుజుకి ఎర్టిగా కారు ధర సుమారుగా రూ.8.64 లక్షలుగా ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

9. Mahindra Marazzo Features : స్ట్రాంగ్​ బాడీ-ఇన్​-ఫ్రేమ్ డిజైన్​తో, సూపర్ ఫీచర్స్​ కలిగి ఉన్న బెస్ట్ ఎస్​యూవీ కారు ఇది. ఈ మహీంద్రా మరాజో కారులో విశాలమైన బూట్​ స్పేస్, సౌకర్యవంతమైన ఇంటీరియర్ డిజైన్ ఉంటుంది. ​రూ.15 లక్షల బడ్జెట్లో మంచి కారు కొనాలని అనుకునేవారికి ఇది కచ్చితంగా బెస్ట్ ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

  • మైలేజ్​ : 17.3 కి.మీ
  • ఫ్యూయెల్ టైప్​ : పెట్రోల్​/ డీజిల్​
  • బూట్ స్పేస్​ : 1055 లీటర్స్​
  • ఇంజిన్​ : 1497 సీసీ
  • ట్రాన్స్​మిషన్​ : మాన్యువల్​/ ఆటోమేటిక్
  • సీట్​ కెపాసిటీ : 7-8
  • ఎయిర్​బ్యాగ్స్​ : 2
  • సేఫ్టీ ఫీచర్స్ : ISOFIX చైల్డ్ సీట్​, రియర్ వ్యూ కెమెరా, ఇంపాక్ట్ సెన్సింగ్​ ఆటో డోర్​ లాక్​ సహా బోలెడ్ సేఫ్టీ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

Mahindra Marazzo Price : మార్కెట్లో ఈ మహీంద్రా మరాజో కారు ధర సుమారుగా రూ.14.10 లక్షలు ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

10. Toyota Innova Crysta Features : లాంగ్ జెర్నీ చేయడానికి ఈ టయోటా ఇన్నోవా క్రిస్టా బాగుంటుంది. కనుక క్యాబ్​ సర్వీస్​కు ఈ టయోటా ఇన్నోవా క్రిస్టా కారు బెస్ట్ ఛాయిస్ అవుతుంది. రూ.20 లక్షల బడ్జెట్లో మంచి కారు కొనాలని అనుకునేవారికి ఇది కచ్చితంగా బెస్ట్ ఆప్షన్​ అవుతుంది.

  • మైలేజ్​ : 8 కి.మీ - 12 కి.మీ
  • ఫ్యూయెల్ టైప్​ : డీజిల్​
  • బూట్ స్పేస్​ : 300 లీటర్స్​
  • ఇంజిన్​ : 2393 సీసీ
  • ట్రాన్స్​మిషన్​ : మాన్యువల్​
  • సీట్​ కెపాసిటీ : 7-8
  • ఎయిర్​బ్యాగ్స్​ : 3 - 7
  • సేఫ్టీ ఫీచర్స్ : యాంటీ లాక్​ బ్రేకింగ్, ఎలక్ట్రానిక్​ బ్రేక్ ఫోర్స్​ డిస్ట్రిబ్యూషన్​, బ్రేక్ అసిస్ట్​

Toyota Innova Crysta Price : మార్కెట్లో ఈ టయోటా ఇన్నోవా క్రిస్టా కారు ధర సుమారుగా రూ.18.05 లక్షలు ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మంచి మైలేజ్​ ఇచ్చే స్కూటీ కొనాలా? ఈ టాప్​-6 మోడల్స్​పై ఓ లుక్కేయండి!

మంచిగా బైక్​ మెయింటెనెన్స్ చేయాలా? ఈ టాప్-10 టిప్స్​ మీ కోసమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.