ETV Bharat / business

2024 ఫిబ్రవరి నెలలోని బ్యాంకు సెలవుల పూర్తి లిస్ట్ ఇదే!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 28, 2024, 10:51 AM IST

Bank Holidays In February 2024
Bank Holidays In 2024 February

Bank Holidays In February 2024 In Telugu : ఈ 2024 ఫిబ్రవరి నెలలో ఏకంగా 11 రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. కనుక బ్యాంక్ ఖాతాదారులు ఇప్పటి నుంచే తమ షెడ్యూల్​ను సరిగ్గా ప్లాన్ చేసుకోవడం మంచిది. లేకుంటే తరువాత ఇబ్బందిపడక తప్పదు. అందుకే ఏయే రాష్ట్రాల్లో, ఎప్పుడెప్పుడు బ్యాంక్​ సెలవులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Bank Holidays In February 2024 : బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్య గమనిక. రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా 2024 ఫిబ్రవరి​​​ నెలకు సంబంధించిన బ్యాంక్​ సెలవుల జాబితాను ప్రకటించింది. అందువల్ల కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని, తమ బ్యాంకింగ్ కార్యకలాపాలను ఒక పద్ధతి ప్రకారం ప్లాన్​ చేసుకోవడం మంచిది. లేకుంటే తరువాత ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ఆర్​బీఐ ప్రతి నెలా బ్యాంక్ సెలవుల (Bank Holidays) జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా 2024 ఫిబ్రవరి నెలలోని సెలవుల జాబితాను కూడా విడుదల చేసింది. ఈ సెలవుల్లో జాతీయ సెలవులు సహా, కొన్ని ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. అందుకే ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

2024 ఫిబ్రవరి నెలలో బ్యాంక్​ సెలవుల జాబితా
List of Bank Holidays In February 2024 :

  • ఫిబ్రవరి 4 (ఆదివారం)
  • ఫిబ్రవరి 10 (రెండో శనివారం)
  • ఫిబ్రవరి 11 (ఆదివారం)
  • ఫిబ్రవరి 14 (బుధవారం) : వసంత పంచమి/ సరస్వతి పూజ సందర్భంగా త్రిపుర, ఒడిశా, బంగాల్​ల్లోని బ్యాంకులకు సెలవు.
  • ఫిబ్రవరి 15 (గురువారం) :లుయి-న్గై-ని పండుగ సందర్భంగా మణిపుర్​లోని బ్యాంక్​లకు సెలవు.
  • ఫిబ్రవరి 18 (ఆదివారం)
  • ఫిబ్రవరి 19 (సోమవారం) : ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
  • ఫిబ్రవరి 20 (మంగళవారం) : రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అరుణాచల్​ప్రదేశ్​, మిజోరంల్లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
  • ఫిబ్రవరి 24 (నాల్గో శనివారం)
  • ఫిబ్రవరి 25 (ఆదివారం)
  • ఫిబ్రవరి 26 (సోమవారం) : న్యోకుమ్ పర్వదినం సందర్భంగా అరుణాచల్​ప్రదేశ్​లోని బ్యాంకులకు సెలవు.

సెలవు దినాల్లో ఆర్థిక లావాదేవీలు జరపడం ఎలా?
How To Make Transactions In Bank Holidays : ఫిబ్రవరి నెలలో 11 రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్​, మొబైల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం నడుస్తూనే ఉంటాయి. అలాగే యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలు కూడా కొనసాగుతాయి. కనుక బ్యాంకులకు వెళ్లకుండానే సులువుగా మీ ఆర్థిక లావాదేవీలు పూర్తి చేసుకోవచ్చు.

నేటి బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎలా ఉన్నాయంటే?

బడ్జెట్‌పై కోటి ఆశలు! ఇన్సూరెన్స్ పాలసీలపై GST తగ్గుతుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.