ETV Bharat / bharat

దొంగను పట్టించిన గూగుల్ మ్యాప్స్!​- ఎలా పట్టుకున్నారంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 6, 2024, 7:39 AM IST

Man Uses Google Maps to Track Thief :
Man Uses Google Maps to Track Thief :

Man Uses Google Maps to Track Thief : గూగుల్​ మ్యాప్స్​ సహాయంతో దొంగిలించిన ఫోన్​, బ్యాగ్​ను పట్టుకున్నాడు ఓ వ్యక్తి. ఈ ఘటన తమిళనాడులోని నాగర్​కొయిల్​లో జరిగింది. ఈ విషయాన్ని అతడు సోషల్​ మీడియాలో పోస్ట్ చేయగా, ఇప్పుడు వైరల్​గా మారింది.

Man Uses Google Maps to Track Thief : టెక్నాలజీ అభివృద్ధి చెందాక మన జీవితంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. నిత్య జీవితంలో చాలా పనులు సులభంగా మారిపోయాయి. ఎంతో విలువైన సమయం, వనరులు కోల్పోకుండా ఈజీగా పనులన్నీ జరిగిపోతున్నాయి. అంతకుముందు ఫోన్​ చోరీ అయితే, దానిపైన ఆశలు వదుకునేవాళ్లం. కానీ ఇప్పుడు అదే టెక్నాలజీ సాయంతో అతి తక్కువ సమయంలోనే పట్టుకుంటున్నాం. ఇలాంటి ఘటనే తమిళనాడులోని నాగర్​కొయిల్​లో జరిగింది. గూగుల్​ మ్యాప్స్​ సహాయంతో దొంగిలించిన ఫోన్​, బ్యాగ్​ను పట్టుకున్నాడు ఓ వ్యక్తి. ఈ విషయాన్ని అతడు సోషల్​ మీడియాలో పోస్ట్ చేయగా, ఇప్పుడు వైరల్​గా మారింది.

ఇదీ జరిగింది
నాగర్​కొయిల్​కు చెందిన ఓ వ్యక్తి తిరుచ్చి వెళ్లేందుకు నాగర్​కొయిల్​-కాచిగూడ ఎక్స్​ప్రెస్​ రైలు ఎక్కాడు. నాగర్​కొయిల్​లో ఆదివారం తెల్లవారుజామున 1.43గంటలకు స్లీపర్​ క్లాస్​లో పడుకున్నాడు. అయితే, రైలులో ఎవరూ లేని సమయం చూసిన ఓ దొంగ, అతడి బ్యాగుతో పాటు ఫోన్​ను దొంగిలించి తిరునెల్వేలి జంక్షన్​లో దిగిపోయాడు. ఆ తర్వాత దీనిని గమనించిన బాధిత వ్యక్తి, వెంటనే తన కుమారుడికి సమాచారం అందించాడు. అయితే, అదృష్టవశాత్తు దొంగిలించిన ఫోన్​లో లొకేషన్​ ఆన్​ చేయడం వల్ల దానిని ట్రాక్​ చేయడం సులభమైంది.

వెంటనే అప్రమత్తమైన అతడి కుమారుడు దానిని పరిశీలించాడు. ఆ ఫోన్​ను దొంగిలించిన వ్యక్తి తిరిగి నాగర్​కొయిల్​కు వచ్చేందుకు తిరునెల్వెలి జంక్షన్​లో మరో ట్రైన్​ ఎక్కినట్లు గుర్తించాడు. అతడిని పట్టుకునేందుకు తన స్నేహితులు, రైల్వే పోలీసులతో కలిసి స్టేషన్​కు వచ్చాడు. కానీ దొంగ వచ్చిన కన్యాకుమారి ఎక్స్​ప్రెస్​ రద్దీగా ఉండడం వల్ల అతడు తప్పించుకుని పారిపోయాడు. లొకేషన్​ ఆన్​లోనే ఉండడం వల్ల అతడిని అనుసరించారు. స్టేషన్​ మెయిన్ గేట్​ నుంచి బయటకు వెళ్లిన దొంగ, అన్న బస్​ స్టాండ్​కు వెళ్లాడు. వెంటనే అప్రమత్తమై, బైక్​పై అతడిని ఫాలో చేసి పట్టుకున్నారు. స్థానికుల సహాయంతో దొంగ నుంచి బ్యాగ్​తో పాటు ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చి అతడిని వారికి అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతడు ఇప్పటికే అనేక దొంగతనాలకు పాల్పడ్డాడని పోలీసుల విచారణలో తేలింది.

గూగుల్ మ్యాప్స్ 'ఫాస్టెస్ట్ రూట్'​- మెట్లపైకి వెళ్లి ఇరుకున్న కారు!

గూగుల్​ మ్యాప్స్​లోనూ లైవ్​ లొకేషన్​ షేరింగ్​- ఎలాగో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.