ETV Bharat / bharat

సండే స్పెషల్​ - నోరూరించే ప్రాన్స్​ బిర్యానీ! ఇలా చేశారంటే మళ్లీ మళ్లీ తినడం పక్కా! - Tasty and Spicy Prawns Biryani

author img

By ETV Bharat Telugu Team

Published : May 26, 2024, 6:08 AM IST

Prawns Biryani Making Process: మీకు ప్రాన్స్​ అంటే ఇష్టమా? వాటితో చేసిన వంటలు ఏవైనా ఓ పట్టు పడతారా? మరి లేట్​ చేయకుండా ప్రాన్స్​ బిర్యానీ ట్రై చేయండి. మాకు రాదు అంటారా? నో టెన్షన్​.. మేము చెప్పే ఈ పద్ధతి ఫాలో అయితే స్పైసీ అండ్​ టేస్టీ బిర్యానీ రెడీ అయినట్లే!!

Tasty and Spicy Prawns Biryani
How to Make Tasty and Spicy Prawns Biryani (ETV Bharat)

How to Make Tasty and Spicy Prawns Biryani: హ్యపీ అకేషన్​ ఏదైనా నాన్​వెజ్​ ప్రియులకు బిర్యానీ అంటే కుసంత మక్కువ ఎక్కువే. ఇక బిర్యానీ లవర్స్​ సంగతి చెప్పక్కర్లేదు. కొత్తిమీర, పుదీనా పరిమళాలు.. కమ్మని నెయ్యి సువాసనలు.. మత్తెక్కించే మసాలాలు.. ఘుమఘుమలాడే రుచులతో... వావ్‌ అనిపించే బిర్యానీలను ఎంతో ఇష్టంగా తింటారు. ఇక బిర్యానీలు అంటే ఎక్కువ మందికి చికెన్​, మటన్​ మాత్రమే గుర్తొస్తాయి. కేవలం అవి మాత్రమే కాదండోయ్​.. నోరూరించే ప్రాన్స్‌ బిర్యానీ కూడా ఉంది. ఒక్కసారి ట్రై చేయండి.. మళ్లీ మళ్లీ చేసుకుని తినాలనిపించేంతా రుచిగా ఉంటుంది. మరి రొయ్యల బిర్యానీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..

ప్రాన్స్​ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు:

  • బాస్మతి బియ్యం- కప్పున్నర
  • రొయ్యలు- రెండు కప్పులు
  • అనాస పువ్వు- ఒకటి
  • లవంగాలు- మూడు
  • మిరియాలు- నాలుగు
  • బిర్యానీ ఆకులు- రెండు
  • ఉప్పు- తగినంత
  • నిమ్మరసం- రెండు చెంచాలు
  • పచ్చి కొబ్బరి తురుము- నాలుగు చెంచాలు
  • పచ్చిమిర్చి- మూడు
  • పుదీనా తురుము- రెండు పెద్ద చెంచాలు
  • అల్లంముక్కలు, వెల్లుల్లి రెబ్బలు- నాలుగు చొప్పున,
  • కొత్తిమీర-కొద్దిగా
  • నెయ్యి- అరకప్పు
  • ఉల్లిపాయలు- 3 (సన్నగా తరుముకోవాలి)
  • కుంకుమపువ్వు పాలు- రెండు చెంచాలు
  • సన్నగా కట్​ చేసిన అల్లం ముక్కలు- కొన్ని
  • గరంమసాలా - ఒక స్పూన్​

సండే లంచ్​ స్పెషల్​ : గ్రీన్​ మసాలా ఫిష్ ఫై - ఇలా చేస్తే ప్లేట్​ ఖాళీ కావాల్సిందే! - Green Masala Fish Fry

తయారీ విధానం:

  • ముందుగా బాస్మతి బియ్యాన్ని కడిగి పెట్టుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలను నూనెలో ఎర్రగా వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ మీద గిన్నె పెట్టి సరిపడా నీళ్లు పోసి అవి వేడయ్యాక అందులో బాస్మతి బియ్యం, అనాస పువ్వు, లవంగాలు, మిరియాలు, బిర్యానీ ఆకులు, గరం మసాలా, కొద్దిగా ఉప్పు వేసి ఉడికించాలి.
  • మరొక గిన్నెలో రొయ్యలు, నిమ్మరసం, ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి.
  • మిక్సీ జార్​ తీసుకుని పచ్చికొబ్బరి తురుము, పచ్చి మిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి కాసిన్ని నీళ్లు పోసి మెత్తగా బ్లెండ్‌ చేసుకోవాలి.
  • ఈ మిశ్రమాన్ని ఓ పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోనే రొయ్యలు, వేయించిన ఉల్లిపాయ ముక్కలను కొన్ని వేసి కలపాలి.
  • ముప్పావు వంతు ఉడికిన అన్నాన్ని నీళ్లు పారబోసి చిల్లుల గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఓ పెద్ద గిన్నె తీసుకుని నెయ్యి వేసి ఉడికించిన అన్నాన్ని పొరలా వేయాలి. దీనిపై రొయ్యల మిశ్రమాన్ని లేయర్‌లా వేసుకోవాలి. వీటిపై మళ్లీ అన్నం, వేయించిన ఉల్లిపాయలు, సన్నగా చీల్చిన అల్లం ముక్కలు వేసుకోవాలి.
  • దీనిపై మళ్లీ రొయ్యల మిశ్రమాన్ని వేయాలి. చివరగా మిగిలిన అన్నాన్ని వేసి.. దీనిపై వేయించిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, కాస్తంత నెయ్యి, కుంకుమపువ్వు పాలు, పుదీనా వేసి మూత పెట్టేయాలి.
  • ఇప్పుడు స్టౌ వెలిగించి దీన్ని ఇరవై నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి మరో ఇరవై నిమిషాలు గిన్నెను అలాగే ఉంచాలి. అందులోని ఆవిరికి రొయ్యలు పూర్తిగా ఉడికిపోతాయి.
  • అంతే ఎంతో రుచికరమైన ప్రాన్స్​ బిర్యానీ రెడీ..!

వీకెండ్​ స్పెషల్​ - చింతచిగురు మటన్​ ! ఇలా చేస్తే సూపర్​ అనాల్సిందే! - Tamarind Leaves chicken

మసాలా ఫిష్ ఫింగర్స్.. ఈ సండే అద్భుతమైన స్నాక్!

సండే స్పెషల్ - బ్లాక్​ మటన్​ రెసిపీ - తిన్నారంటే మైమరచిపోతారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.