ETV Bharat / bharat

సండే స్పెషల్ : జింజర్ పెప్పర్ చికెన్ రెసిపీ - ఆహా ఏమి రుచి అంటారంతే! - Ginger Pepper Chicken Recipe

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 31, 2024, 11:37 AM IST

Chicken
Ginger Pepper Chicken

Ginger Pepper Chicken Recipe : సండే రోజు చికెన్‌ తెచ్చారంటే.. దాంతో పులుసు పెట్టాలా లేదా వేపుడు చేయాలా అని ఆలోచిస్తారు. లేదంటే గబగబా బిర్యానీ వండేస్తారు. అయితే ఈసారి ఎప్పటిలాగా కాకుండా.. సరికొత్తగా జింజర్ పెప్పర్ చికెన్ రెసిపీని ట్రై చేయండి. రుచి అదిరిపోతుంది! ఆరోగ్య ప్రయోజనాలూ లభిస్తాయి. మరి, ఆ రెసిపీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

How to Prepare Ginger Pepper Chicken : మీరు ఇప్పటివరకు చికెన్ 65, చికెన్ లాలిపాప్, చికెన్ ఫ్రై, పులుసు పెట్టడం, బిర్యానీ.. ఇలా రకరకాల రెసిపీలు ప్రయత్నించి ఉండవచ్చు. కానీ.. ఎప్పుడైనా జింజర్ పెప్పర్ చికెన్ ట్రై చేశారా? లేదు అంటే.. ఇప్పుడే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. కాస్త ఘాటు ఘాటుగా ఉండే ఈ రెసిపీని ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్లీ మళ్లీ చేసుకోవాలనిపిస్తుంది. దీనిని మీరు చపాతీ లేదా అన్నంతో కలిపి తింటే ఆ కాంబినేషన్ అద్దిరిపోతుంది. అంతేకాదు.. ఈ రెసిపీతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి, ఇంకెందుకు ఆలస్యం జింజర్ పెప్పర్ చికెన్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో చూసేద్దామా!

జింజర్ పెప్పర్ చికెన్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు :

  • అరకేజీ - చికెన్
  • రెండు టేబుల్ స్పూన్లు - అల్లం పేస్ట్
  • రెండు టేబుల్ స్పూన్లు - మిరియాల పొడి
  • ఒక టేబుల్ స్పూన్ - నూనె
  • ఒక టేబుల్ స్పూన్ - వెనిగర్
  • ఒక టేబుల్ స్పూన్ - సోయా సాస్
  • ఒక టేబుల్ స్పూన్ - సోంపు
  • దాల్చిన చెక్క ముక్క - ఒకటి
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ఉల్లిపాయ - ఒకటి (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
  • గార్నిష్ కోసం కొత్తిమీర - 3 టేబుల్ స్పూన్లు (సన్నగా తరుక్కోవాలి)

నోరూరించే పులావ్​- ఇలా చేశారంటే వహ్వా అంటూ ప్లేట్లు నాకాల్సిందే!

జింజర్ పెప్పర్ చికెన్ తయారీ విధానం :

  • ముందుగా మీరు చికెన్​ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ మంట మీడియం ఫ్లేమ్​లో ఉంచి దానిపై ఒక ప్యాన్ పెట్టి అందులో నూనె పోసుకోవాలి. అది కాస్త హీట్ అయ్యాక అందులో ఇంగువ, దాల్చిన చెక్క వేసి కాస్త వేయించుకోవాలి.
  • తర్వాత అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. ఆపై అల్లం పేస్ట్ వేసి మరో నిమిషం పాటు ఆ మిశ్రమాన్ని వేయించుకోవాలి.
  • అలా మిశ్రమం వేగాక అందులో కడిగిన చికెన్, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ప్యాన్​పై మూతపెట్టి ఆ మిశ్రమాన్ని 20 నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
  • ఆ విధంగా ఉడికించుకున్నాక ప్యాన్ మూత ఓపెన్ చేసి అందులో సోయాసాస్, వెనిగర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఆ మిశ్రమాన్ని బాగా కలిపి మంటను కాస్త పెంచి చికెన్​లో వాటర్ గుంజుకునే వరకు ఉడికించుకొని ఆ తర్వాత మిరియాల పొడి, కొత్తిమీర చల్లి నిమిషం పాటు ఉంచి దించుకుంటే ఘుమఘుమలాడే స్పైసీ జింజర్ పెప్పర్ చికెన్ రెడీ!
  • అంతే.. ఈ రుచికరమైన చికెన్ రెసిపిని మీరు అన్నం, రోటీతో ప్రయత్నించినట్లయితే సూపర్‍గా ఉంటుంది. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.
  • ఈ రెసిపీని తిన్నారంటే.. దగ్గు, జలుబు, ఫ్లూలు కూడా ఇట్టే మటుమాయమయిపోతాయి. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు.. అల్లం జీర్ణక్రియను మెరుగుపరచడంలో, వికారం తగ్గించడంలోనూ సహాయపడుతుందంటున్నారు.

సండే స్పెషల్‌ స్పైసీ ఎగ్‌ కీమా కర్రీ - ఇలా చేస్తే ప్లేట్లు ఖాళీ కావాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.