ETV Bharat / bharat

సండే స్పెషల్‌ స్పైసీ ఎగ్‌ కీమా కర్రీ - ఇలా చేస్తే ప్లేట్లు ఖాళీ కావాల్సిందే!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 16, 2024, 5:40 PM IST

How To Make Spicy Egg Keema For Lunch : సండే వచ్చిందంటే నాన్​వెజ్​ కచ్చితంగా ఉండాల్సిందే. ఇక నాన్​వెజ్​ అంటే చికెన్​, మటన్​, ఫిష్​.. ఇలా నచ్చినవి వండుకుని తింటుంటారు. అయితే ఎప్పుడూ ఇవే కాకుండా.. ఎగ్స్​తోనే అద్దిరిపోయే డిష్​ రెడీ చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా లాగిస్తారు. మరి ఆ రెసిపీ కోసం లేట్​ చేయకుండా ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.

How To Make Spicy Egg Keema For Lunch
How To Make Spicy Egg Keema For Lunch

How To Make Spicy Egg Keema: ఎగ్స్‌తో ఏ కర్రీ వండిన సూపర్‌ టేస్టీగా ఉంటుంది. అలాగే, ఇందులో పోషకాలు కూడా పుష్కలంగా ఉండటంతో రోజంతా కావాల్సిన శక్తి అందుతుంది. అయితే, ఎగ్స్‌తో కోడిగుడ్డు కూర, ఆమ్లెట్‌, కోడి గుడ్డు పులుసు చేయడం కామనే. కానీ, ఈ సారి కాస్త కొత్తగా కోడి గుడ్లతో స్పైసీ ఎగ్‌ కీమా ట్రై చేయండి. ఇక కీమా అనగానే అందరూ మటన్‌తోనే చేస్తారని అనుకుంటారు. కానీ, బాయిల్డ్​ ఎగ్స్‌తో కూడా కీమా ట్రై చేయొచ్చు. ఒక్కసారి ఇంట్లో ఈ ఎగ్‌ కీమాను ప్రిపేర్‌ చేశారంటే పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ వావ్‌ సూపర్‌ టేస్టీగా ఉంది కర్రీ అని మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే. అంత బాగుంటుంది మరి ఈ ఎగ్‌ కీమా కర్రీ. అయితే, దీన్ని ఎలా ప్రిపేర్‌ చేయాలో తెలుసుకుని మీరు కూడా ఈ సండే రోజూ ట్రై చేయండి.

స్పైసీ ఎగ్‌ కీమా కర్రీ రెడీ చేయడానికి కావాల్సిన పదార్థాలు :

  • కోడిగుడ్లు - 6
  • నూనె - 2 టేబుల్ స్పూన్లు
  • ఉల్లిపాయ - 1 పెద్దది
  • టమాటలు - 2
  • పచ్చిమిర్చి - 2
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • కారం - రుచికి సరిపడా
  • పసుపు - 1 టీస్పూన్
  • ధనియాల పొడి - 1 టేబుల్​ స్పూన్​
  • గరం మసాలా - 1 టేబుల్ స్పూన్
  • కొత్తిమీర తరుగు - గుప్పెడు
  • ఉప్పు - రుచికి సరిపడా

Sunday Special Non Veg Curries : సండే స్పెషల్.. నాటుకోడి కూర.. బోటీ మసాలా ఫ్రై.. ఇలా చేశారంటే.. బొక్కకూడా వదలరు

ఎగ్‌ కీమా తయారు చేయు విధానం :

  • ముందుగా స్టౌ ఆన్ చేసి గిన్నెలో నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి గుడ్లను ఉడికించుకోవాలి.
  • గుడ్లు ఉడికిన తర్వాత వాటిపైన ఉన్న పొట్టు తీసి.. సన్నని ముక్కలుగా కట్​ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
  • అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు సన్నగా కట్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ పై పాన్‌ పెట్టి ఆయిల్‌ వేసుకోవాలి.
  • నూనె వేడెక్కాక జీలకర్ర, పచ్చిమర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్​ బ్రౌన్​ కలర్​ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి పచ్చి వాసన పోయేంతవరకు వేయించుకోవాలి.
  • తర్వాత టమాట ముక్కలు, పసుపు యాడ్‌ చేసుకుని కలుపుకోవాలి.
  • ఇప్పుడు ఇవి కొద్దిగా ఉడికిన తర్వాత రుచికి సరిపడా కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత సన్నగా కట్‌ చేసుకున్న ఎగ్స్‌ను కర్రీలోకి యాడ్‌ చేసుకుని కొద్దిగా కలుపుకోవాలి. పైన కొద్దిగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకోవాలి.
  • అంతే ఎంతో సింపుల్‌ అండ్‌ టేస్టీ స్పైసీ ఎగ్‌ కీమా రెడీ. దీన్ని వేడి వేడి అన్నంలో గానీ, లేదా చపాతీల్లోకీ కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.

Egg Recipes Telugu : సండే స్పెషల్.. కాస్త వెరైటీగా ఈ 'గుడ్డు' స్నాక్స్ ట్రై చేయండి.. వెరీగుడ్ అనక మానరు

Egg Recipes Telugu : సండే స్పెషల్.. కాస్త వెరైటీగా ఈ 'గుడ్డు' స్నాక్స్ ట్రై చేయండి.. వెరీగుడ్ అనక మానరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.