ETV Bharat / bharat

భారత హాకీ ప్లేయర్​పై కేసు- పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఫిర్యాదు

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 6, 2024, 8:48 AM IST

Updated : Feb 6, 2024, 9:24 AM IST

FIR Against National Hockey Player
FIR Against National Hockey Player

FIR Against National Hockey Player : పెళ్లి చేసుకుంటానని నమ్మించి మరో క్రీడాకారిణిని మోసం చేశాడు భారత హాకీ జట్టు ఆటగాడు, అర్జున అవార్డు గ్రహీత వరుణ్​ కుమార్​. పెళ్లి పేరుతో నమ్మించి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

FIR Against National Hockey Player : భారత హాకీ జట్టు ఆటగాడు, అర్జున అవార్డు గ్రహీత వరుణ్​ కుమార్​ చిక్కుల్లో పడ్డాడు. వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ హైదరాబాద్​కు చెందిన ఓ యువ క్రీడాకారిణి కేసు పెట్టింది. కర్ణాటక బెంగళూరులోని జ్ఞానభారతి పోలీస్ స్టేషన్​లో అతడిపై కేసు నమోదైంది.

ఇదీ జరిగింది
హైదరాబాద్​కు చెందిన ఓ యువతి వాలీబాల్​ క్రీడాకారిణి. ఆమె 2016-17 సమయంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్​ ఇండియా సౌత్​ డివిజన్​ ఇచ్చే శిక్షణకు ఎంపిక అయ్యింది. ఆ సమయంలో హాకీ ఆటగాడు వరుణ్​ కుమార్​ సోషల్​ మీడియాలో పరిచయం అయ్యాడు. ఈ క్రమంలోనే వారి మధ్య స్నేహం పెరిగి ప్రేమగా మారింది. 2019లో జయనగర్​కు రాత్రి డిన్నర్​కు తీసుకెళ్లి లైంగికంగా సంబంధం పెట్టుకున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత కూడా పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూ దాదాపు ఐదేళ్ల పాటు సంబంధాన్ని కొనసాగించాడని తెలిపింది. గతేడాది తన తండ్రి మరణించినప్పుడు వచ్చి వెళ్లాడని, ఆ తర్వాత తప్పించుకుని తిరుగుతున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న​ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

హిమాచల్​ ప్రదేశ్​కు చెందిన వరుణ్ కుమార్​, ప్రస్తుతం భారత హాకీ జట్టులో డిఫెండర్​గా కొనసాగుతున్నాడు. 2017లో ఇండియన్ టీమ్​లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు, 2022లో జరిగిన బర్మింగ్​హమ్​ కామన్​వెల్త్​ గేమ్స్​లో రజతం గెలిచిన జట్టులో సభ్యుడు. 2020 టొక్యో ఒలింపిక్స్​లో కాంస్యం, ఆ తర్వాత 2022 ఆసియా గేమ్స్​లో స్వర్ణ పతకాన్ని సాధించిన జట్టులో ఉన్నాడు. ఇతడికి హిమాచల్​ ప్రదేశ్​ ప్రభుత్వం రూ. కోటి రివార్డు సైతం ప్రకటించింది. క్రీడా రంగంలో అతడి సేవలకు గాను కేంద్రం 2021లో అర్జున అవార్డును ఇచ్చింది.

రేప్​ కేసులో నేపాల్​ క్రికెట్ టీమ్​ మాజీ కెప్టెన్​
ఇటీవలె నేపాల్​ క్రికెట్​ టీమ్​ మాజీ కెప్టెన్​ సందీప్‌ లామిచ్చెన్‌ సైతం ఓ మైనర్​పై అత్యాచారం కేసులో దోషిగా తేలాడు. గతేడాది ఆగస్టులో కాఠ్ మాండూలోని ఓ హోటల్​లో సందీప్‌ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మైనర్‌ బాలిక కోర్టును ఆశ్రయించింది. దీంతో కొన్నాళ్ల కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి కోర్టులో హాజరుపరిచారు. గతేడాది నవంబర్​లో అతడ్ని జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. అయితే హై కోర్టుకు వెళ్లి సందీప్ బెయిల్ తెచ్చుకున్నాడు. కాగా, తాజాగా కోర్టు అతడ్ని దోషిగా నిర్ధరించింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Last Updated :Feb 6, 2024, 9:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.