తెలంగాణ

telangana

చెరుకు కోసం చెక్​పోస్ట్​కు అడ్డంగా ఏనుగుల గుంపు. వాహనదారులకు ఇక్కట్లు

By

Published : Oct 17, 2022, 10:43 PM IST

తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని చామరాజనగర్ అనసూర్‌ చెక్‌పోస్టు వద్ద ఏనుగుల గుంపు తనిఖీ అధికారుల అవతారం ఎత్తాయి. ఎవరూ తమ నుంచి తప్పించుకోలేరు అన్న విధంగా చెక్‌పోస్టు వద్ద రహదారికి అడ్డంగా నిలుచున్నాయి. సుమారు 10 ఏనుగులు రోడ్డుకు అడ్డంగా గుమిగూడటం వల్ల వాహనదారులకు చుక్కలు కనిపించాయి. కొద్దిసేపు తర్వాత ఏనుగులు వచ్చిన దారినే వెళ్లిపోవడం వల్ల అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆ రహదారిపై ఎక్కువగా చెరుకు పంటను తరలిస్తుంటారు. వాటిని తినేందుకే అక్కడికి ఏనుగుల వస్తున్నాయని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details