తెలంగాణ

telangana

నారా లోకేశ్​కు వైఎస్ షర్మిల క్రిస్మస్ కానుక - కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్

By ETV Bharat Telangana Team

Published : Dec 25, 2023, 11:27 AM IST

Nara Lokesh About YS Sharmila Christmas Gift

YS Sharmila Christmas Gift To Nara Lokesh : తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​కు జగన్ సోదరి, వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల క్రిస్మస్ కానుక పంపారు. ‘‘ద వైఎస్‌ఆర్‌ ఫ్యామిలీ విషెస్‌ యూ.. ఏ డిలైట్‌ఫుల్‌ క్రిస్మస్‌ అండ్‌ ఏ బ్లెస్డ్‌ 2024’’ అని రాసి ఉన్న గ్రీటింగ్‌ కార్డునూ పంపి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని ఆదివారం టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎక్స్‌ వేదికగా షేర్ చేశారు.

కానుక పంపినందుకు షర్మిలకు లోకేశ్ ధన్యవాదాలు తెలియజేశారు. ‘‘అద్భుతమైన కానుకలు  పంపినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. నారా కుటుంబం తరఫున మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్‌, నూతన సంవత్సర శుభాకాంక్షలు’’ అని ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్​కు షర్మిల పంపిన గ్రీటింగ్‌, గిఫ్ట్‌ బాక్స్‌ల చిత్రాలను జత చేశారు.

Chandrababu Naidu Christmas Wishes : మరోవైపు క్రిస్మస్‌ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​లు శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. సమాజంలోని బాధితుల పక్షాన నిలబడి ప్రేమను పంచడం అందరిని సమదృష్టితో చూడటం ద్వారా క్రీస్తు ఆశించిన శాంతియుత సమాజ స్థాపనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

Nara Lokesh Christmas Wishes :ప్రభువైన ఏసు క్రీస్తు ఆచ‌రించిన‌ ప్రేమ‌, క‌రుణ‌, స‌హ‌నం ప్రతి ఒక్కరిలో పెంపొందాలని లోకేశ్ తెలిపారు. క‌రుణామ‌యుడైన క్రీస్తు మ‌న‌కు అందించిన శాంతి సందేశం స‌మాజానికి పంచి ప్రపంచ‌శాంతికి దోహ‌ద‌ప‌డాలని కోరారు. క్రీస్తు చూపిన మార్గమైన ద‌య, త్యాగ‌గుణం ప్రతీ ఒక్కరూ అల‌వ‌రుచుకున్నప్పుడే జీవితం సంతోష‌మ‌యం అవుతుందన్నారు. ద‌యామ‌యుడు లోకానికి వ‌చ్చిన ప‌ర్వదిన‌మైన క్రిస్మస్ పండ‌గ‌ని ఆనందోత్సాహాల‌తో జ‌రుపుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details