తెలంగాణ

telangana

Siddhartha Luthra will Argue on Chandrababu Arrest చంద్రబాబు తరఫున వాదనలు వినిపించనున్న సిద్దార్థ లూథ్రా

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2023, 7:11 PM IST

Updated : Sep 9, 2023, 7:23 PM IST

Chandrababu_remand_petition_updates

Siddhartha Luthra will Argue on Chandrababu Arrest: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి రిమాండ్ పిటిషన్​పై మరికాసేపట్లో విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు జరగనున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడి తరఫున ఏసీబీ కోర్టులో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించనున్నారు. ఇందుకోసం ఆయన దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వచ్చారు. 

మరోవైపు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు.. తాడేపల్లిలోని కుంచనపల్లి సిట్ కార్యాలయానికి తరలించారు. సిట్ కార్యాలయంలో చంద్రబాబును ప్రశ్నించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రశ్నించిన అనంతరం చంద్రబాబు నాయుడికి వైద్య పరీక్షలు చేయనున్నారు. ఆ తర్వాత విజయవాడ ఏసీబీ కోర్టులో ఆయనను హాజరుపరచనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్న విషయాన్ని తెలుసుకున్న టీడీపీ మహిళా కార్యకర్తలు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో విజయవాడలోని సిటీ కోర్టు కాంప్లెక్స్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు అరెస్టుపై భగ్గుమన్న మహిళలు.. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు.

Last Updated : Sep 9, 2023, 7:23 PM IST

ABOUT THE AUTHOR

...view details