తెలంగాణ

telangana

Niranjan Reddy on Telangana Crop Loss : 'త్వరలోనే రాష్ట్రంలో.. ప్రత్యేక పంట బీమా పథకం'

By

Published : Aug 4, 2023, 2:14 PM IST

Niranjan Reddy on Telangana Crop Loss : 'ప్రత్యేక పంట బీమా పథకాన్ని తెచ్చేందుకు ప్రభుత్వ అధ్యయనం'

Niranjan Reddy on Crop Insurance Scheme in Telangana : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఫసల్‌ బీమా పథకం విఫలమైందని.. రాష్ట్రంలో అన్నదాతలను ఆదుకునేందుకు ప్రత్యేక పంటల బీమా పథకాన్ని తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పంటల బీమా నిలిపివేత, అతివృష్టితో నష్టపోయిన రైతులకు రూ.10 వేల పరిహారంపై శాసన మండలిలో కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్ ​రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి నిరంజన్​ రెడ్డి ఈ మేరకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలోనే వర్షాలకు నష్టపోతే ఏ పంటైనా.. ఎకరానికి రూ.పది వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. దీని కింద రూ.151 కోట్లు ఇప్పటికే బాధితులకు అందజేశామన్న నిరంజన్‌రెడ్డి.. మరో రూ.160 కోట్ల మేర త్వరలోనే అందిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఫసల్‌ బీమాను నాలుగేళ్ల పాటు రాష్ట్రంలో అమలు చేసి రూ.500 కోట్లు నష్టపోయామని.. ఈ క్రమంలోనే కేంద్రంతో సంబంధం లేకుండా ప్రత్యేక విధానాన్ని తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details