తెలంగాణ

telangana

గోదావరి నీళ్లతో గజ్వేల్ ప్రజల కాళ్లు కడిగిన ఘనత కేసీఆర్​దే : మంత్రి హరీశ్​రావు

By ETV Bharat Telangana Team

Published : Nov 17, 2023, 5:28 PM IST

Minister Harish Rao Election Campaign at Gajwel

Minister Harish Rao Election Campaign at Gajwel :గుండె మీద చేయి వేసుకొని ఒక్కసారి ఆలోచించండి.. ఇతర పార్టీ వాళ్లు ఇన్ని రోజులు కనిపించారా అని మంత్రి హరీశ్​రావు ప్రజలను ఉద్దేశిస్తూ ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. గజ్వేల్‌లో నిర్వహించిన రోడ్‌షోలో మంత్రి హారిశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా సమయంలో కూడా తిరిగింది గులాబీ పార్టీ నాయకులే అని గుర్తు చేశారు. కేసీఆర్ గజ్వేల్​కు వచ్చాక ఇక్కడి భూముల విలువతో పాటు మనుషుల విలువలు కూడా పెరిగిపోయాయి అని అన్నారు. కొందరు ఎన్నికల ప్రచారంలో ఘాటు మాటలు మాట్లాడుతున్నారని.. వారి మాటలు విని మోసపోవద్దని సూచించారు. 

గోదావరి నీళ్లతో గజ్వేల్ ప్రజల కాళ్లు కడిగిన ఘనత కేసీఆర్​దేనని హరీశ్​రావు అన్నారు. కర్ణాటకలో మూడు గంటల కరెంట్ వస్తాదని.. అది కూడా 30 సార్లు వస్తదని ఆ ప్రాంత ప్రజలే అంటున్నారని ఎద్దేవా చేశారు. 24 గంటల కరెంట్ కావాలంటే కారుకు ఓటు వేయండి, 3 గంటల కరెంట్ కావాలంటే కాంగ్రెస్​కు వేయండి అంటూ మంత్రి ప్రజలకు వివరించారు. రైతు బంధు దండగ అని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారని మండిపడ్డారు. ముచ్చటగా మూడో సారి కూడా సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details