తెలంగాణ

telangana

వాకర్ సాయంతో కేసీఆర్ అడుగులు - ఆరోగ్యం కాస్త మెరుగుపడిందన్న వైద్యులు

By ETV Bharat Telangana Team

Published : Dec 9, 2023, 7:24 PM IST

KCR Walk With Help of Walker

KCR Walk With Help of Walker : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని యశోద ఆసుపత్రి వైద్యులు వివరించారు. ​ఆయనకు నిన్న తుంటి మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. ఈక్రమంలో డాక్టర్లు ఇవాళ కేసీఆర్​ను వాకర్ సాయంతో నడిపించారు. కేసీఆర్ మానసికంగా ధ్రుడంగా ఉన్నారని,  శరీరం ఇలాగే సహకరిస్తే రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జి చేసే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు. సుమారు ఆరు నుంచి ఎనిమిది వారాల విశ్రాంతి అవసరం ఉంటుందన్నారు.

కేసీఆర్ సాధారణ ఆహారం తీసుకుంటున్నారని, శ్వాసకు సంబంధించిన వ్యాయామం కూడా చేయిస్తున్నామని తెలిపారు. కొన్ని రోజుల పాటు ఫిజియోథెరపీ కొనసాగించాల్సి ఉంటుందని వైద్యులు వివరించారు. ఎంఐఎం అధినేత, ఎమ్మెల్యే అసదుద్దీన్ ఓవైసీ యశోద ఆస్పత్రికి వెళ్లారు. కేటీఆర్​ను కలిసి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు. సమాజ్ వాదీ పార్టీ నేత, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, కేటీఆర్​కు ఫోన్ చేసి కేసీఆర్ ఆరోగ్య సమాచారం అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  

ABOUT THE AUTHOR

...view details