తెలంగాణ

telangana

ఐనవోలు మల్లన్న జాతరకు పోటెత్తిన భక్తులు - భద్రత పెంచిన పోలీసులు

By ETV Bharat Telangana Team

Published : Jan 14, 2024, 2:05 PM IST

Inavolu Mallanna Swamy Jatara In Warangal

Inavolu Mallanna Swamy Jatara In Hanamkonda : హనుమకొండ జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయం భక్త జనం సందోహంగా మారింది. సంక్రాంతి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మల్లికార్జున స్వామివారికి మొక్కులు సమర్పించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తుల తరలివస్తున్నారు. పోలిసులు భక్తుల భద్రత దృష్ట్యా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 

Police High Security At Mallanna Inavolu Jatara : సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడకుండా చెక్ పోస్టులు, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. 150 సీసీ కెమెరాలతో నిఘా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 400కు పైగా పోలీసు సిబ్బంది జాతరలో సేవలందిస్తున్నట్లు వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ తెలిపారు. మహిళల భద్రత దృష్ట్యా పదుల సంఖ్యలో షీ టీమ్స్, జేబు దొంగల దృష్ట్యా ప్రత్యేక పోలీసు బృందాలు జాతరలో నిరంతరం గస్తీ కాస్తున్నట్లు వెల్లడించారు. స్వామివారి దర్శనం మొదలు తిరిగి ఇంటికి వెళ్లే వరకు అవసరమయ్యే అన్ని రక్షణ చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details