తెలంగాణ

telangana

రోజుకు 500 విమానాల రాకపోకలు.. అందులో అతివల పాత్ర ఆదర్శనీయం

By

Published : Mar 7, 2023, 7:49 PM IST

రోజుకు 500 విమానాలు రాకపోకలు

womens day special దేశంలో అత్యంత రద్దీగా ఉండే ఎయిర్ పోర్టులో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి. దిల్లీ, ముంబయి, బెంగళూరు తర్వాత నాలుగో స్థానాన్ని హైదరాబాద్ ఎయిర్ పోర్టు ఆక్రమించింది. ఇక్కడి శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రతి మూడు నిమిషాలకు ఒక విమానం రాకపోకలు సాగిస్తోంది. అయితే ఈ విమానాలను కంట్రోల్ చేసేది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్. 

ఇదీ శంషాబాద్ విమానాశ్రయంలోనే ఓ టవర్ లో ఉంటుంది. ఇక్కడి నుంచి చూస్తునే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు పైలట్లకు మార్గనిర్దేశం చేస్తు విమానాలను నియంత్రిస్తుంటారు. విమానం ఇంజిన్ స్టార్టింగ్ నుంచి గాల్లో ఎగిరి రాడర్ కనెక్ట్ అయ్యే వరకు ఏటీసీ చూసుకుంటుంది. ఇక విమానాలు ల్యాండ్ అయ్యే సమాచారాన్ని రాడర్ నుంచి తీసుకుని క్షేమంగా ల్యాండ్ అయ్యేలా చూస్తారు. 

ఏటీసీ ఎలా పనిచేస్తుంది... అక్కడి ఉద్యోగులు ఎలాంటి విధులు నిర్వహిస్తుంటారు... విపతక్కర పరిస్థితుల్లో ఎలా వ్యవహరిస్తారు.... వాతావరణం సహకరించని సమయంలో విమానాలు క్షేమంగా దిగేందుకు ఎలా నిర్ణయాలు తీసుకుంటారు. శంషాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ గ్రౌండ్ రిపోర్టు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు.

ABOUT THE AUTHOR

...view details