తెలంగాణ

telangana

రాజస్థాన్​పై మజ్లిస్ కన్ను.. పోటీకి సై.. మైనారిటీలకు ఒవైసీ పిలుపు

By

Published : Jun 1, 2022, 6:46 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

MIM Rajasthan politics: మజ్లిస్ పార్టీ రాజస్థాన్​లో పాగా వేసేందుకు సిద్ధమైంది. బిహార్, బంగాల్​, యూపీలో అదృష్టాన్ని పరీక్షించుకున్న ఎంఐఎం.. వచ్చే ఎన్నికల్లో రాజస్థాన్​లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మజ్లిస్ పార్టీ రాజస్థాన్ యూనిట్​ను బుధవారం ప్రారంభించారు ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. ఈ సందర్భంగా 'ఈటీవీ భారత్'​తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ప్రస్తుతానికి ఆరుగురు సభ్యులతో కూడిన కోర్ కమిటీని నియమించామని, జులై చివరి నాటికి పూర్తి స్థాయిలో రాష్ట్ర కార్యవర్గాన్ని సిద్ధం చేస్తామని చెప్పారు. కమిటీకి జమీల్ ఖాన్ అధ్యక్షుడిగా ఉండనున్నట్లు తెలిపారు. జైపుర్​తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు నిర్వహిస్తానని ఒవైసీ చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో మైనారిటీల ప్రాతినిధ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన ఒవైసీ.. మైనారిటీలను అణచివేస్తున్నారని, వారి సమస్యలను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఇకపై అలా జరగకుండా చేస్తానని చెప్పుకొచ్చారు. తమ రాజకీయ నాయకులకు ప్రోత్సాహం ఇవ్వాలని రాజస్థాన్ మైనారిటీలకు పిలుపునిచ్చారు. అయితే, దీన్ని ఓటు బ్యాంకుగా పరిగణించకూడదని అన్నారు. మరోవైపు, గహ్లోత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సచిన్ పైలట్ తమ మిత్రుడేనని పేర్కొన్న ఒవైసీ.. గహ్లోత్ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన విషయాన్ని గుర్తు చేశారు. మరోవైపు, సీఏఏ, జ్ఞాన్​వాపి మసీదు వివాదంపై న్యాయపోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
Last Updated :Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details