తెలంగాణ

telangana

సచివాలయంలో సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి - ఘనస్వాగతం పలికిన ఉద్యోగులు

By ETV Bharat Telangana Team

Published : Dec 7, 2023, 9:52 PM IST

CM Revanth Reddy at Sachivalayam

CM Revanth Reddy Visit Secretariat in Hyderabad :తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా సీఎల్పీ నేత రేవంత్​ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం అక్కడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి, అనంతరం రెండు దస్త్రాలపై సంతకాలు చేశారు. అక్కడి నుంచి సచివాలయానికి చేరుకున్న సీఎం రేవంత్​ రెడ్డి. సచివాలయంలోని ఆరో అంతస్తులో ఉన్న సీఎం ఛాంబర్​లో సీఎం కుర్చీలో ఆశీనులయ్యారు. తొలి దస్త్రంపై సంతకం చేశారు. 

CM Revanth Reddy at Secretariat :ఈ సందర్భంగా రేవంత్​కు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. రేవంత్‌తో పాటు ఆయన సతీమణి కూడా ఉన్నారు. అంతకు ముందు సీఎం రేవంత్ సచివాలయం ఆవరణ అంతా కలియ తిరిగారు. సీఎంకు సచివాలయం ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. సీఎం హోదాలో తొలిసారి సచివాలయానికి వచ్చిన రేవంత్​ రెడ్డికి సచివాలయ అధికారులు, ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మంత్రులతో కలిసి సచివాలయం ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌కు వెళ్లిన ఆయన అక్కడే తొలి కేబినెట్​(Cabinet) భేటీ నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు సీఎస్ శాంతికుమారి, వివిధ శాఖల కార్యదర్శులు హాజరైన ఈ సమావేశంలో ఆరు గ్యారంటీల అమలు, ప్రజా సమస్యలపై చర్చించారు.

ABOUT THE AUTHOR

...view details