తెలంగాణ

telangana

ప్రతిధ్వని: కరోనా నుంచి పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి?

By

Published : Jun 8, 2021, 9:20 PM IST

దేశాన్ని కుదిపేసిన కరోనా రెండో వేవ్ శాంతిస్తోన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రోజువారీ కొవిడ్ కేసులు క్రమంగా దిగి వస్తున్నాయి. కానీ మెజార్టీ ప్రజల్లో మాత్రం ఆ ఊరట కనిపించడం లేదు. కారణం.. కలవర పెడుతున్న మూడో వేవ్ ముప్పు. మూడో దశలో 25 శాతం మంది పిల్లలకు కరోనా వైరస్ అన్న మాటతో భయాందోళనలు ఏ ఒక్కర్ని స్తిమితంగా ఉండనీయడం లేదు. తొలి, రెండో విడత కేసుల ఆధారంగా చెబుతున్నాం .. అంటున్న గణాంకాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 18 ఏళ్లు లోపు వారికి టీకాలు ఇంకా అందుబాటులోకి రాకపోవటం, ఈసారి వైరస్ లక్ష్యం వాళ్లే అన్న అంచనాలు కాళ్లకింద నేల కదిలేలా చేస్తున్నాయి. మరి.. పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి?.. వైద్య సౌకర్యాల మాట ఏమిటి?.. ప్రభుత్వాల సన్నద్ధత ఎలా ఉండాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details