తెలంగాణ

telangana

Walking Without Chappal Benefits : ఒత్తిడి దూరం.​. శరీరానికి ఫుల్​ రిలీఫ్​.. చెప్పులు లేకుండా న‌డిస్తే ఎన్నో ప్రయోజనాలు!

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2023, 8:10 AM IST

Walking Without Chappal Benefits : ఒక‌ప్పుడు కాళ్ల‌కు చెప్పులు లేకుండా న‌డిచేవాళ్లు కానీ.. నేటి కాలంలో అలా చేస్తే అంద‌రూ విచిత్రంగా చూస్తారు క‌దా. ఇలా న‌డిస్తే ఏమ‌వుతుందనే సందేహం మీకెప్పుడైనా వ‌చ్చిందా? ఇలా చేయ‌డం వ‌ల్ల ఏమైనా ఆరోగ్య ప్ర‌యోజ‌నాలున్నాయా? వీటికి స‌మాధానం ఇది చ‌దివి తెలుసుకోండి.

Health Benefits Of Walking Barefoot Full Details Here In Telugu
Benefits Of Walking Without Footwear

Walking Without Chappal Benefits : పూర్వ‌కాలంలో కాళ్ల‌కు చెప్పుల్లేకుండా తిరిగారు కానీ.. నేటి ఆధునిక యుగంలో పాద‌ర‌క్ష‌లు వేసుకోకుండా బ‌య‌టికి వెళ్ల‌లేం. బ‌య‌టి సంగ‌తి ప‌క్క‌న పెడితే.. కొంద‌రు ఇంట్లో ఉన్న‌ప్పుడు కూడా వాటిని ఉప‌యోగిస్తారు. అయితే.. పాద‌రక్ష‌లు లేకుండా న‌డిస్తే ఏమ‌వుతుంది? దాని వ‌ల్ల ఏమైనా ప్ర‌యోజ‌నాలున్నాయా? అని మీకెప్పుడైనా సందేహం వ‌చ్చిందా ? దానికి సమాధానం ఇదిగో.

Benefits Of Walking Without Footwear :ఇటీవల జ‌రిగిన ఓ ప‌రిశోధ‌న‌లో దీనికి సంబంధించి ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. పాద‌ర‌క్ష‌లు లేకుండా న‌డ‌వ‌టాన్ని గ్రౌండింగ్, ఎర్తింగ్ అని కూడా పిలుస్తారు. మ‌న శ‌రీరానికి భూమికి నేరుగా సంబంధం ఉండే ఈ ప్ర‌క్రియ వ‌ల్ల శ‌రీర ఆరోగ్యంతో పాటు మాన‌సిక ఆర్యోగ్యంపైనా సానుకూల ప్ర‌భావం ఉంటుంది. మ‌రి వీటితో పాటు ఇంకా ఏమేం ఉంటాయో తెలుసుకుందాం.

Benefits Of Walking Without Slippers : పాదరక్షలు లేకుండా నడవడం వల్ల కలిగే గొప్ప ప్రయోజనాల్లో ఒకటి శరీరంలో మంటను తగ్గించే సామర్థ్యం. భూమి ఉపరితలం ఫ్రీ ఎలక్ట్రాన్ల స‌ర‌ఫ‌రా క‌లిగి ఉంటుంది. మ‌నం చెప్పుల్లేకుండా న‌డిచినప్పుడు ఈ ఫ్రీ ఎలక్ట్రాన్లు... మ‌న శ‌రీరంలో హానిక‌ర‌మైన, ఇన్ ఫ్ల‌మేష‌న్​కు కార‌ణ‌మైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరిస్తాయి. ఫ‌లితంగా ఈ గ్రౌండింగ్ ప్ర‌క్రియ ద్వారా ఇన్​ఫ్ల‌మేష‌న్​ను గ‌ణ‌నీయంగా త‌గ్గించుకోవ‌చ్చ‌ని అధ్య‌య‌నాలు సూచిస్తున్నాయి. దీని వ‌ల్ల దీర్ఘ‌కాలిక నొప్పులు త‌గ్గ‌డ‌మే కాకుండా రోగనిరోధక ప్రతిస్పందన సైతం పెరుగుతుంది.

Walking Barefoot For Heart : చెప్పులు లేకుండా నడవడం మన హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ప్ర‌క్రియ ర‌క్త ప్ర‌స‌ర‌ణ‌, హృద‌య స్పంద‌న మార్పుల‌కు అనుసంధాన‌మై ఉంటుంది. ఇది హృదయ స్పందన రేటు, ఇతర శారీరక విధులను నియంత్రిస్తుంది. పాద‌ర‌క్ష‌లు ధ‌రించకుండా న‌డ‌వ‌డం ద్వారా ఆరోగ్యకరమైన హృదయ స్పందన లయ పెంపొందుతుంది. అంతేకాకుండా ఒత్తిడిని దూరం చేసి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Walking Barefoot For Stress :పాద‌రక్ష‌లు లేకుండా న‌డ‌వ‌డం ఒత్తిడి దూర‌వ‌మ‌వ‌ట‌మే కాకుండా.. నిద్ర‌పైనా ప్ర‌భావం చూపుతుంది. ఒత్తిడి వ‌ల్ల నిద్ర‌లేమి స‌మ‌స్య ఉంటుంది. ఒత్తిడికి సంబంధించిన కార్టిసాల్ హార్మోన్ స్థాయుల్ని ఈ గ్రౌండింగ్ విధానం నియంత్రిస్తుంది. ఫ‌లితంగా మ‌న శ‌రీరానికి ఉపశమనం దొరికి నాణ్య‌మైన నిద్ర ల‌భిస్తుంది. చెప్పులు లేకుండా నడవడం నిద్ర విధానాలను నియంత్రించి మొత్తం నిద్రపోయే స‌మ‌యాన్నీ మెరుగుప‌ర్చ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది.

Barefoot Walking Health Benefits : ఈ ఎర్తింగ్ ప్ర‌క్రియ వల్ల కలిగే ప్రయోజనాలు శ‌రీరానికే ప‌రిమిత‌మై పోకుండా.. మాన‌సిక ఉల్లాసానికీ క‌లుగుతాయి. పాద‌ర‌క్ష‌లు లేకుండా న‌డ‌వ‌డం వల్ల భూమితో ప్ర‌త్య‌క్ష సంబంధం ఏర్ప‌డుతుంది. ఇది ప్ర‌కృతితో క‌నెక్ట్ అయి.. మాన‌సికి స్థితినీ మెరుగు ప‌రుస్తుంది. ఫ‌లితంగా ఆందోళ‌న‌, ఒత్తిడి వంటివి దూర‌మ‌వుతాయి. మొత్తం మీద ప్ర‌శాంతంగా ఉండేందుకు తోడ్ప‌డుతుంది.

What Is Probiotic : ప్రోబయోటిక్స్ అంటే ఏమిటి?.. వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Sore Throat Reasons Precautions : తరుచూ గొంతు నొప్పి వస్తోందా? ఈ సింపుల్​ టిప్స్​తో సమస్యకు చెక్​ పెట్టండి!

ABOUT THE AUTHOR

...view details