తెలంగాణ

telangana

స్టోన్‌ ఫ్రూట్స్​లో ఔషధ గుణాలెన్నో.. క్యాన్సర్​ సహా అనేక రోగాలుకు చెక్​!

By

Published : Dec 7, 2022, 8:41 AM IST

మామిడి, పీచ్‌, ఆప్రికాట్స్‌, ప్లమ్స్‌, చెర్రీస్‌, రాస్బెర్రీ.. వంటి పండ్లను స్టోన్‌ ఫ్రూట్స్ గా చెబుతారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో విటమిన్‌ సీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచుతాయి. వీటి నుంచి లభించే మరిన్ని ప్రయోజనాలను తెలుసుకుందాం.

stone fruit benefits
స్టోన్‌ ఫ్రూట్స్ ప్రయోజనాలు

సాధారణంగా చాలా పండ్లలో గింజలు ఉండడం మనకు తెలిసిందే. అయితే కొన్ని పండ్లలో వీటిని కప్పి ఉంచే ఒక చిన్న రాయి లాంటి దృఢమైన నిర్మాణం ఉండి.. దాని చుట్టూ పండు గుజ్జు ఉంటుంది. ఇలాంటి పండ్లనే ‘స్టోన్‌ ఫ్రూట్స్’ అంటారు. మామిడి, పీచ్‌, ఆప్రికాట్స్‌, ప్లమ్స్‌, చెర్రీస్‌, రాస్బెర్రీ.. వంటి పండ్లు ఇందుకు ఉదాహరణలు. అయితే వీటిలో ఎక్కువ శాతం ఆయా కాలాల్లో మాత్రమే లభ్యమవుతాయని.. తద్వారా అవి సహజంగా పరిపక్వం చెంది అమోఘమైన రుచిని అందిస్తాయని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు.. ఆరోగ్యాన్ని, అందాన్ని పెంపొందించే ఔషధ గుణాలు కూడా వీటిలో పుష్కలంగా ఉన్నాయంటున్నారు.

రోగనిరోధక శక్తికి..!
కాలం మారే కొద్దీ వివిధ రకాల అనారోగ్యాలు చుట్టుముట్టడం సహజమే! అయితే వీటిని ఎదుర్కొనే రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలంటే స్టోన్‌ ఫ్రూట్స్‌ అందుకు చక్కటి ప్రత్యామ్నాయం అంటున్నారు నిపుణులు. విటమిన్‌ ‘సి’, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా నిండి ఉండే ఈ పండ్లు ఫ్రీరాడికల్స్‌ నుంచి శరీరానికి రక్షణ కల్పిస్తాయి. అలాగే తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచి.. శరీరం వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, అలర్జీలను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

రక్తపోటు నియంత్రణలో..!
అధిక రక్తపోటుతో బాధపడేవారు తీసుకునే మందుల కారణంగా అప్పుడప్పుడూ అలసట, నీరసం వేధించడం సహజమే! అయితే వీటి నుంచి విముక్తి పొంది నరాలు, కండరాలు రిలాక్స్‌ కావాలంటే స్టోన్స్‌ ఫ్రూట్స్‌ తీసుకోవడం అత్యుత్తమమైన మార్గం అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా పీచ్‌, ప్లమ్‌.. వంటి పండ్లలో పొటాషియం స్థాయులు అధికంగా ఉంటాయి. ఇవి రక్తనాళాల్లో రక్త ప్రసరణ సాఫీగా సాగేలా చేసి బీపీని అదుపు చేస్తాయి. తద్వారా అలసట, నీరసం.. వంటివి దూరమవుతాయి.

క్యాన్సర్లను అడ్డుకుంటాయి!
అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపుటలవాట్లే వివిధ రకాల క్యాన్సర్లకు కారణమవుతున్నాయని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే కొంతమందిలో వంశపారంపర్యంగా కూడా ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మరి, వాటి బారిన పడకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా స్టోన్‌ ఫ్రూట్స్‌ని ఆహారంలో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. వీటిలోని ఫైటోకెమికల్స్ వంటివి కణాలు డ్యామేజ్‌ కాకుండా కాపాడతాయి. ఫలితంగా క్యాన్సర్‌ ముప్పును చాలా వరకు తప్పించుకోవచ్చు.

ABOUT THE AUTHOR

...view details