తెలంగాణ

telangana

Skipping Health Benefits : పొట్ట చుట్టూ కొవ్వు తగ్గాలా?.. రోజూ 'స్కిప్పింగ్'​ చేస్తే చాలు!

By

Published : Aug 16, 2023, 7:45 AM IST

Skipping Health Benefits In Telugu : అధిక బరువుతో బాధపడే వాళ్లు బరువు తగ్గాలని అనుకునే వారికి ఉత్తమైన మార్గం స్కిప్పింగ్. మనం ఆరోగ్యకరంగా, ఉల్లాసంగా ఉండేందుకు కూడా స్కిప్పింగ్​ దోహదం చేస్తుంది. మరి రోజూ స్కిప్పింగ్​ చేయడం వల్ల ఎన్ని రకాల లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Skipping Health Benefits In Telugu Full Details Here
Jumping Health Benefits In Telugu

Skipping Health Benefits In Telugu : చాలామంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు. బరువు తగ్గేందుకు చాలా రకాల వ్యాయామాలు చేస్తుంటారు. కానీ వేగంగా బరువు తగ్గాలంటే ఏది ఉత్తమమైన వ్యాయామమో చాలా మందికి తెలియదు. ఒక్కో రకమైన ఎక్సర్సైజ్ ఒక్కొక్కరికి ఒక్కోలా పనిచేస్తుంది. కానీ అన్ని రకాల శరీరతత్వాలకు అత్యుత్తమంగా పనిచేసే వ్యాయామమే 'స్కిప్పింగ్'.

చాలామంది బరువు తగ్గాలనే ఉద్దేశంతో వ్యాయామంతో పాటు ఆహారపు అలవాట్లను కూడా మార్చుకుంటారు. చాలామంది నిపుణులు చెప్పేదేంటంటే స్కిప్పింగ్( Skipping Health Benefits ) అనేది అందరికీ అందుబాటులో ఉన్న అద్భుతమైన వ్యాయామం. ఇందుకోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. జిమ్​లకు వెళ్లాల్సిన అవసరం అంతకన్నా లేదు. కేవలం ఒక రోప్, షూ ఉంటే చాలు. అయితే ప్రతిరోజు స్కిప్పింగ్​ చేయడం వల్ల మన శరీరంలోని అవయావాల పనితీరు కూడా మెరుగవుతుందని అంటున్నారు డాక్టర్లు.

పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును స్కిప్పింగ్​ కరిగిస్తుంది.

కండరాల పటిష్ఠత..
Skipping Muscle Benefits : క్రమం తప్పకుండా స్కిప్పింగ్​ చేయడం వల్ల శరీరంలోని క్యాలరీలు అధిక స్థాయిలో ఖర్చవుతాయి. అదే సమయంలో కండరాలు కూడా పటిష్ఠడతాయి. కాళ్లు చేతులతో పాటు పూర్తి శరీరం కూడా కదలడం వల్ల శరీరాకృతి కూడా ఫిట్​గా మారుతుంది.

హృదయం పదిలం..
Skipping Health Benefits : శరీర బరువును తగ్గించడమే కాకుండా గుండె కండరాలను కూడా స్కిప్పింగ్ దృఢంగా ఉంచుతుంది. స్కిప్పింగ్​ చేసే సమయంలో జంపింగ్ వల్ల హార్ట్​బీట్ రేట్, బ్రీతింగ్ రేట్​లు పెరుగుతాయి. ఆ సమయంలో గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగు పడుతుంది. శరీరంలోని అన్ని భాగాలకు రక్తం, ఆక్సిజన్ సరఫరా సాఫీగా సాగుతుంది.

స్కిప్పింగ్​ చేయడం వల్ల శరీరంలోని అధిక కొవ్వు కరుగుతుంది.

బాడీ బ్యాలెన్స్ పెరుగుదల..
Skipping Body Balance In Telugu : స్కిప్పింగ్​ చేయడం ద్వారా శరీరంలోని అన్ని భాగాలు కదులుతాయి. దీంతో కాళ్లు, చేతులు, ఇతర అవయవాల మధ్య సమన్వయం చక్కగా కుదురుతుంది. తద్వారా బాడీ బ్యాలెన్స్ పెరుగుతుంది.

బరువు తగ్గడంలో స్కిప్పింగ్​ సహాయపడుతుంది.

బరువు తగ్గుదల..
Skipping Weight Loss :శరీర భాగాల వేగవంతమైన( Jumping Health Benefits ) కదలికల వల్ల ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి. ఇది శరీర బరువును తగ్గిస్తుంది. భుజాలపై, పొట్టు చుట్టూ పేరుకుపోయిన కొవ్వులను కూడా స్కిప్పింగ్​ కరిగిస్తుంది. శరీర భాగాల్లో అధిక కొవ్వు కరగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఒత్తిడి నుంచి ఉపశమనం..
Stress Free From Skipping Rope : ఏ విధమైన వ్యాయామం చేసినా.. శరీరంలో డోపమైన్​ అనే హార్మోన్​ విడుదల అవుతుంది. స్కిప్పింగ్​ చేయడం ద్వారా ఇది మరింత ఎక్కువగా రిలీజ్​ అవుతుంది. వీటి విడుదలతో మనలోని ఒత్తిడి తగ్గుతుంది.

ఎముకల దృఢత్వాన్ని స్కిప్పింగ్​ పెంచుతుంది.

ఎముకలు దృఢంగా..
Skipping For Bone Health :స్కిప్పింగ్​లో పైకి కిందకు ఎగరడం వల్ల తాత్కాలికంగా ఎముకలపై ఒత్తిడి పడుతుంది. కానీ అది దీర్ఘకాలికంగా ఎముకలను మరింత పటిష్ఠం చేస్తుంది.

ABOUT THE AUTHOR

...view details