తెలంగాణ

telangana

ఈ దినుసులతో రోగనిరోధక శక్తి మీ సొంతం..!

By

Published : Aug 9, 2021, 6:19 PM IST

కరోనా విజృంభణ తర్వాత ప్రజల ఆహార అలవాట్లలో భారీ మార్పులే వచ్చాయి. రోజూ తీసుకునే ఆహారంలో ఔషధ గుణాలున్న సుగంధద్రవ్యాల వాడకం పెరిగింది. మనం నిత్యం ఇంట్లో వాడే వంట దినుసులు రోగనిరోధక శక్తిని పెంచుతాయని.. నిపుణులు చెబుతున్నారు. మరి ఆ దినుసుల వల్ల ఏమేమి ఉపయోగాలున్నాయో చూద్దామా..?

immunity boosting spices
రోగనిరోధక శక్తిని పెంచే దినుసులు

వంటిల్లే.. వైద్యశాల అని పూర్వీకులు చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మనం నిత్యం వాడే వంట దినుసులు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి.. వైరస్​లకు అడ్డుకట్ట వేస్తాయని నిపుణులు అంటున్నారు. మరి అవి ఏంటో తెలుసుకుందాం..

అల్లం: అల్లం అజీర్తికి మంచిది. కఫానికి దివ్య ఔషధం.

జీలకర్ర: జీలకర్రతో జీర్ణక్రియ వేగవంతమవుతుంది. ఐరన్ పుష్కలంగా ఉండి హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.

ఆవాలు: ఆవాలు శరీరంలోని కొలెస్ట్రాల్​ను అదుపులో ఉంచుతాయి. రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.

మిరియాలు: మిరియాలు శరీరంలోని కణాలను తాజాగా ఉంచుతాయి. క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకుంటాయి. ఆకలిని పెంచుతాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి.

మెంతులు: మెంతులలో రక్తాన్ని పలుచన చేసే గుణం వుంది. కీళ్ళ నొప్పుల్ని తగ్గిస్తాయి. మూత్రనాళ సంబంధిత సమస్యల్ని, శ్వాస సంబంధిత సమస్యల్ని తగ్గిస్తాయి.

వాము:అజీర్ణం, కఫం, అధిక రక్తపోటుతో బాధపడే వారికి వాము అద్భుతంగా పనిచేస్తుంది.

పసుపు:పసుపులో క్యాన్సర్ నిరోధక లక్షణాలున్నాయి. యాంటీ బ్యాక్టీరియల్ మందుగానూ పనిచేస్తుంది.

దాల్చినచెక్క: దాల్చినచెక్కతో గుండె పనితీరు మెరుగుపడుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. శరీరంలో ఇన్సులిన్ స్థాయిని పెంచుతుంది.

యాలకులు: యాలకుల్లో రక్తాన్ని పలుచన చేసే గుణం ఉంది. ఉబ్బసం, దగ్గు నుండి ఉపశమనాన్నిస్తుంది. జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది.

లవంగాలు:లవంగాలు రక్తాన్ని శుద్ధి చేసి రోగనిరోధకశక్తిని పెంచుతాయి. కఫం, దగ్గు, జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి.

వెల్లుల్లి:వెల్లుల్లి అనేక రుగ్మతలకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. అధిక రక్తపోటుని తగ్గిస్తుంది. రక్తకణాల్లో కొలెస్ట్రాల్​ స్థాయిని అదుపులో ఉంచుతుంది.

ఇదీ చదవండి:అమ్మాయిలూ ఒత్తిడికి గురవుతున్నారా.. అయితే ఇవి తినండి!

ABOUT THE AUTHOR

...view details