ETV Bharat / sukhibhava

అమ్మాయిలూ ఒత్తిడికి గురవుతున్నారా.. అయితే ఇవి తినండి!

author img

By

Published : Aug 7, 2021, 2:07 PM IST

ఇంటి బాధ్యతల్నీ, ఆఫీసు విధుల్నీ చక్కబెట్టుకునే క్రమంలో పురుషులతో పోలిస్తే మహిళలు ఒకింత ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారని చెబుతున్నాయి అధ్యయనాలు. ఇది దీర్ఘకాలం కొనసాగితే... అనేక అనారోగ్య ముప్పులూ ఉన్నాయని హెచ్చరిస్తున్నాయి. దీన్ని అధిగమించడానికి ఆహారమూ సాయపడుతుందని చెబుతున్నారు వైద్యులు. అదెలాగంటే...

food tips to get protein for women
అమ్మాయిలూ ఇవి తినండి

ఇంటా బయటా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలంటే ఎవరికైనా కత్తి మీద సాము లాంటిదే.. అలాంటిది మహిళలు ఇటు కుటుంబ బాధ్యతలు, అటు ఉద్యోగ వ్యవహారాలు నిర్వర్తించాలి. పురుషులతో పోలిస్తే మహిళలు శారీరకంగా బలహీనంగా ఉంటారు. దానికితోడు ఒత్తిడికి లోనైతే తీవ్రంగా అలసిపోతారు. వారికి శారీరక విశ్రాంతి కంటే మానసిక ఒత్తిడి ఎంతో అవసరం.. మానసికంగా ఒత్తిడికి గురైతే ఎన్నో అనారోగ్యాలు వచ్చే అవకాశముంది. అందుకే మంచి ఆహారం తీసుకుంటే అనారోగ్య సమస్యలను సులభంగా జయించొచ్చు అంటున్నారు వైద్యులు. ప్రొటీన్ల​తో కూడుకున్న ఆహారమైతే ఇంకా మేలు. మరి ఆ ఆహార పదార్థాలు ఏంటంటే..

బాదం: వీటిలో విటమిన్‌ బి2, విటమిన్‌ ఇ ఉంటాయి. ఇవి శరీరంలో సెరటోనిన్‌ ఉత్పత్తికి సహాయపడతాయి. ఇది ఒత్తిడీ, వ్యాకులతకు కారణమయ్యే కారకాలతో పోరాడుతుంది. వ్యాధినిరోధక శక్తి పెంచుతుంది. అందుకే రోజూ నాలుగైదు బాదం పప్పులనైనా తినండి.

జామ/కమలా/ బొప్పాయి: ఇవి విటమిన్‌-సికి కేరాఫ్‌ అడ్రస్‌ లాంటివి. రక్తపోటును నియంత్రిస్తుంది. ఒత్తిడిని పెంచే కార్టిసాల్‌ హార్మోనును అదుపులో ఉంచుతుంది. అల్పాహారం తర్వాత ఓ పండు తిని చూడండి. ఫలితం మీకే అర్థమవుతుంది.

పాలకూర: దీనిలో మెగ్నీషియం అధికం. ఇది కార్టిసాల్‌ స్థాయుల్ని నియంత్రిస్తుంది. మూడ్‌ స్వింగ్స్‌ని మారుస్తుంది. ఒత్తిడినీ అదుపులో ఉంచుతుంది.

పాలు: వీటిలో యాంటీ ఆక్సిడెంట్లూ, విటమిన్‌ బి2, బి12, మాంసకృత్తులూ, క్యాల్షియం ఎక్కువ. పాలలో ఉండే లాక్టిమమ్‌ యునిక్‌ మిల్క్‌ ఎక్స్‌ట్రాక్ట్‌.. మెదడుకి ఉపశమనాన్నిచ్చే సుగుణాలున్న బయోయాక్టివ్‌ ప్రొటీన్‌ని కలిగి ఉంటుంది. దాంతో ఒత్తిడి తగ్గుతుంది. ఇందులోని పొటాషియం కండరాల నొప్పులను తగ్గిస్తుంది.

చేపలు: వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్‌, అడ్రినలిన్‌ స్థాయులను నియంత్రిస్తాయి. కాబట్టి వారంలో రెండు సార్లు చేపలను రుచి చూసేయండి మరి.

ఇదీ చదవండి: BJP: 14 నుంచి సంజయ్ పాదయాత్ర.. ఓల్డ్​సిటీ నుంచే ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.