తెలంగాణ

telangana

Gas trouble solution: పొట్టలో గ్యాస్​ సమస్య.. ఇదే కారణం!

By

Published : Sep 24, 2021, 4:16 PM IST

Gas trouble solution

మనలో చాలామందిని వేధించే సమస్యల్లో ఒకటి గ్యాస్​ ట్రబుల్​(Gas trouble solution). మరి దీనిని తగ్గించుకోవడం ఎలా? అసలు ఇది ఎందుకు వస్తుంది? లాంటి విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆకలి, మనిషిని ఏదైనా తినేలా చేస్తుంది. అలా అని ఏదిపడితే అది తింటే పొట్ట తిప్పలు పడాల్సిందే. దానికితోడు కడుపులో ఏర్పడే గ్యాస్​ తెగ ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. అయితే పొట్టలో గ్యాస్​ (gas trouble home remedies)తగ్గించుకునేందుకు కొన్ని ఆహార పదార్థాలు దూరం పెట్టడం సహా కొన్ని చిట్కాలు పాటిస్తే సరి. ఇంతకీ అవి ఏంటంటే?

గ్యాస్ సమస్య-కారణాలు

మారుతున్న జీవనశైలి, వేళకు ఆహారం తీసుకోకపోవడం, మానసిక ఒత్తిడి, రాత్రి నిద్రపట్టకపోవడం, నిరంతర ఆలోచనలు, అకారణంగా కోపం రావడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, కూల్​డ్రింక్​లు తాగడం.. మన కడుపులో గ్యాస్​ సమస్యకు(gas trouble symptoms) కారణాలు.

గ్యాస్​ ప్రేరేపించే ఆహారాలు

బీన్స్, చిక్కుళ్లు, క్యాబేజీ, కాలీఫ్లవర్, పాలు, పాల ఉత్పత్తులు, గోధుమ, శనగపిండి వంటకాలు, వేరుశనగ, కందిపప్పు, ఉల్లిపాయ, పచ్చి కూరగాయలు, ద్రాక్ష, సార్బిటాల్ అధిక మోతాదులో ఉండే ఆపిల్, బ్లూబెర్రీలు, పుచ్చకాయ, స్టార్చ్ ఉండే పుట్టగొడుగులు, దుంపలు, కార్బోనేటెడ్ పానీయాలు తీసుకోవడం వల్ల గ్యాస్​ ఏర్పడుతుంది. కాబట్టి వీలైనంత వరకు వీటిని తక్కువ మోతాదులో తీసుకోవడం లేదా పూర్తిగా మానేయడం(gas trouble food items) మంచిది.

మసాలాలు, వేపుళ్లు, ఆయిల్ ఫుడ్స్, ఫాస్ట్​ఫుడ్, ఆల్కహాల్, స్కోకింగ్, టీ, కాఫీ కూడా మానేయాలి.

గ్యాస్​ తగ్గడానికి చిట్కా

నిత్యం కొంతసేపు వ్యాయామం చేస్తూ, తిన్న ఆహారం జీర్ణమయ్యేలా చూసుకోవాలి. మానసిక ప్రశాంతత కోసం యోగా, ప్రాణయామం లాంటివి తరుచుగా చేయాలి. అప్పుడు ఆరోగ్యం అదుపులో ఉండటమే కాకుండా పొట్టలో గ్యాస్​(gas trouble tablets) కూడా ఏర్పడదు!

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details