బరువు పెరుగుతున్నారా? కారణాలు ఇవే కావచ్చు!

author img

By

Published : Sep 21, 2021, 4:45 PM IST

Weight Gaining

రోజూ సమతుల్య ఆహారం, వ్యాయామం చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. కానీ ఎక్కువ క్యాలరీలు తీసుకుని.. వ్యాయామం చేయకపోవడం వల్ల బరువు పెరిగే (Weight Gaining) అవకాశం ఉంది. అయితే అన్నీ సరిగా చేసినా బరువు పెరగడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవి ఏంటి? ఎలాంటి కారణాల వల్ల బరువు పెరుగుతాం? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

శరీర ఎత్తుకు తగినట్లు బరువు ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉన్నట్లు. దీనిని బీఎంఐ సూచిక ద్వారా తెలుసుకోవచ్చు. రోజూ మంచి పోషకాలు కలిగిన ఆహారం తీసుకుంటూ.. ఉదయం లేదా సాయంత్రం తగినంత వ్యాయాయం చేస్తూ.. క్యాలరీలను కరిగించినప్పుడు శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. లేని పక్షంలో అమాంతం బరువు పెరిగి (Weight Gaining) అది కాస్తా స్థూలకాయానికి దారి తీస్తుంది. స్థూలకాయం లేదా ఊబకాయం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒకవేళ సమపోషకాలు తీసుకుంటూ.. క్యాలరీలు కరిగేందుకు తగినంత వ్యాయామం చేసినా బరువు పెరుగుతున్నారు అంటే.. అందుకు కారణాలు వేరే ఉంటాయి. నిద్రలేమి కారణంగా శరీర బరువులో మార్పు వస్తుంది. పని ఒత్తిడి పెరిగిన స్థూలకాయానికి దారి తీస్తుంది. కొన్ని రకాల వ్యాధులకు తీసుకునే మందులు కూడా బరువు పెరుగుదలకు కారణమవుతాయి. ముఖ్యంగా ఆందోళన తగ్గించే మందులకు ప్రధానమైన సైడ్​ ఎఫెక్ట్​ బరువు పెరగడం. ఒకవేళ అలాంటి మందులు వాడేవారి బరువులో మార్పు వస్తే.. వైద్యులతో చర్చించాలి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కారణాలు ఇవే..

  • సరైన వ్యాయామం చేసినా.. బరువు పెరుగుతున్నాం అంటే దానికి ప్రధానం కారణం నిద్రలేమి. నిద్ర లేకపోవడం వల్ల మనలో ఉన్న హార్మోన్లు పెరుగుతాయి. దీంతో మూడు సార్లు తీసుకోవాల్సిన ఆహరం కాస్తా.. నాలుగు సార్లు తీసుకుంటాం.
  • పని ఒత్తిడి పెరిగినప్పుడు కూడా బరువు పెరుగుతాం. పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు హంగర్​ హార్మోన్లు కూడా పెరుగుతాయి. దీంతో తెలిసో.. తెలియకో మనం ఎక్కువ ఆహారం తీసుకుంటాం. ఇది బరువు పెరుగుదలకు దారి తీస్తుంది.
  • అనేక వ్యాధులకు సంబంధించి మనం స్టెరాయిడ్స్​ వాడుతాం. వీటి వాడకం వల్ల కూడా మనం బరువు పెరుగుతాం. ఇలా పెరుగుతున్నప్పుడు వాటిని కొనసాగించాలా? లేదా? అనే దానిపై డాక్టర్​తో చర్చించి నిర్ణయం తీసుకోవడం మంచిది.
  • యాంటీ సైక్రోన్​కు, మైగ్రెన్​కు వాడే మందులు, అధిక రక్తపోటుకు వేసుకునేవి, మధుమేహం మందులు కూడా ఊబకాయానికి దారి తీస్తాయి.
  • కుటుంబ నియంత్రణకు వాడే మందులు కూడా అధిక బరువుకు కారణమవుతాయి.
  • వయసు పెరిగే కొద్ది ఆహారాన్ని కూడా మనం తగ్గించుకోవాలి. లేకపోతే బరువు పెరిగి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి.
  • శరీరంలో తగినంత థైరాయిడ్​ హార్మోన్​ లేని పక్షంలో మెటబాలిజం తగ్గిపోయి బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
  • మోనోపాజ్​ దశకు చేరిన మహిళ్లలో అధిక బరువు పెరగడం కనిపిస్తుంది. వయసు పెరగడం వల్ల జీవక్రియలు మందగించి బరువు పెరుగుతారు.
  • బరువు నియంత్రణలో ఉంటే ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా ఉంచుకున్నట్లే లెక్క. కాబట్టి ఎప్పటికప్పుడు బరువును పరిశీలించుకోవాలి.

ఇదీ చూడండి: జీ-స్పాట్​ అంటే ఏంటి.. భావప్రాప్తిలో దాని పాత్రేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.