Asthma Food: ఆస్తమా ఉందా? ఈ ఆహారం తీసుకోండి!

author img

By

Published : Sep 22, 2021, 4:15 PM IST

ఆస్తమా ఉన్నవారు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు

ఆస్తమా.. ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న సమస్య. ఏటేటా ఈ బాధితుల సంఖ్య మరింత పెరుగుతోంది. అంతకంతకూ పెరుగుతోన్న కాలుష్యానికి తోడు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆస్తమా పీల్చి పిప్పిచేస్తోంది. ఇంతగా వేధిస్తున్న ఆస్తమాను ఆహారంతో చెక్​ పెట్టవచ్చని అంటున్నారు పోషకాహార నిపుణులు. మరి ఎలాంటి ఆహారం (Asthma Food) తీసుకోవడం ద్వారా ఆస్తమా నుంచి ఉపశమనం పొందవచ్చు?

దీర్ఘకాలిక శ్వాస సంబంధ వ్యాధుల్లో ఆస్తమా ఒకటి. చలికాలంలో ఇది మరింతగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వృద్ధుల్లో ఈ సమస్య మరింత ఎక్కువ! ఆస్తమా రోగులకు ఆహారం (Asthma Food) విషయంలో ఎలాంటి నిబంధనలు లేవు. చల్లటి ఆహార పదార్థాలు, పానీయాలు కొన్నిసార్లు ఆస్తమాను ఎక్కువ చేస్తాయి. పిల్లలకు ఆస్తమా ఉంటే చాక్లెట్స్, స్వీట్స్​, కూల్​ డ్రింక్స్, జంక్​ ఫుడ్​ లాంటి ఆహారాలను ఇవ్వొద్దు. ధూమపానం, మద్యపానం, వాయుకాలుష్యం, రసాయనాల వాసన పీల్చడం వల్ల కూడా ఆస్తమా వస్తుంది. పూలమొక్కల నుంచి విడుదలయ్యే పుప్పొడి రేణువులు, జంతుకేశాలు, దుమ్మూ ధూళి, బొద్దింకలు, శ్వాసకోశ ఇన్​ఫెక్షన్లు, ఫ్లూ, జలుబు లాంటివి ఈ సమస్యకు కారణమవుతుంటాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆస్తమా ఉన్న వారు తీసుకోవాల్సిన ఆహరం..

  • శరీరతత్వానికి సరిపోయే విధంగా ఉన్న ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి.
  • చల్లని, పుల్లని, తియ్యని ఆహార పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి.
  • చిన్న పిల్లలు అయితే క్రీమ్​ బిస్కెట్స్​, చాక్లెట్స్​ ఎక్కువగా తిన్నప్పుడు ఆస్తమాకు సంబంధించిన లక్షణాలు బయటపడుతున్నాయి.
  • విటమిన్​ సీ, ఈ, బీటాకెరోటిన్​, ఫ్లేవనాయిడ్స్​, మెగ్నీషియం, సెలీనియం అధికంగా లభించే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆస్తమాను అదుపులో పెట్టుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
  • కొంతమందికి పెరుగు, మజ్జిగ కూడా పడవు. అటువంటి వారు వాటికి కొంతకాలం పాటు దూరంగా ఉండటం మంచిది.
  • కోడిగుడ్డు, పాలు, క్యారెట్​, పాలకూర లాంటి గ్రీన్​ఫుడ్స్​ను ఎక్కువగా తీసుకోవాలి.
  • కాంటాపోల్​, స్వీట్​ పొటాటో, బ్రకోలి వంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
  • యాపిల్, అరటి పండులను తీసుకోవాలి.
  • ప్రతిరోజు మెగ్నీషియం అధికంగా లభించే గుమ్మడి విత్తనాలను ఆహారంగా తీసుకోవడం అలవరుచుకోవాలి.
  • కాకరకాయ రసం ప్రతిరోజు తీసుకుంటే పేగులు శుభ్రం కావడం సహా ఆస్తమా తగ్గుతుంది.

ఇదీ చూడండి: Healthy Aging Tips: వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా ఉండాలంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.