ఇది చేస్తే మీ శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది!

author img

By

Published : Sep 23, 2021, 1:56 PM IST

Do Tattoos Boost Your Immune System?

మానవాళిలో ఉన్న ఎన్నో వ్యాధుల నుంచి బయట పడేందుకు ఒకే ఒక్క మార్గం మనలోని రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే! పుట్టుకతో సహజంగా వచ్చే శక్తిని పెంపొందించుకోడంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కొన్ని రోగాలు వచ్చి మనకు తెలియకుండానే నయమైపోతుంటాయి. అయితే పుట్టుకతో పాటు తినే ఆహారం, వ్యాయామం ద్వారా ఈ రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుందంటారు. వీటితో పాటు మరో పని చేస్తే కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. అదేంటో తెలుసా?

రోగనిరోధక వ్యవస్థ ఎంత గొప్పగా ఉంటే.. అనేక వ్యాధుల నుంచి ప్రాణాపాయం ముప్పు అంత తక్కువగా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, కంటి నిండా నిద్ర, ఒత్తిడిని తగ్గించుకోవటం వంటివన్నీ రోగనిరోధక వ్యవస్థకు దన్నుగా నిలుస్తాయి. వీటికో పాటు మరో పనిచేస్తే రోగనిరోధక శక్తి పెరిగే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.

శరీరంపై పచ్చబొట్టు వేయించుకోవడం వల్ల కూడా రోగనిరోధక శక్తి పెరిగే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆహారపు అలవాట్లు, వ్యాయామాలతో పాటు దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలుస్తోంది.

ఈటీవీలో ప్రసారమవుతూ.. వినోదాన్ని విజ్ఞాన్ని పంచే కార్యక్రమంగా పేరున్న 'క్యాష్​' ప్రోగ్రామ్​లో ఈ ప్రశ్నను వ్యాఖ్యాత సుమ అడిగారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన నటులు ప్రదీప్ మాచిరాజు, కొరియోగ్రాఫర్​ యష్​, సంగీత దర్శకుడు అనూప్​ రూబెన్స్​, గాయని సునీత మాస్టర్ హాస్యాస్పదంగా సమాధానాలిచ్చారు. ఈ ప్రశ్నకు ప్రదీప్​, కొరియోగ్రాఫర్​ యష్​.. సరిగ్గా బదులిచ్చారు. ఈ క్రమంలో మరిన్ని ప్రశ్నలు సంధించారు సుమ.

ప్రశ్న: ఏ ఫోబియా ఉన్న వారు ఇంజక్షన్​ అంటే ఎక్కువగా భయపడుతుంటారు?

జవాబు: ట్రైపనో ఫొబియా.

ప్రశ్న: ఆస్ట్రేలియాలో ఏ జంతువు మ్యాజిక్​ చేసేవాళ్ల దగ్గర తప్ప ఇతరుల దగ్గర ఉండకూడదనే రూల్​ ఉంది?

జవాబు: కుందేలు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి.. ఏ పని చేస్తే ఎక్కువ కాలం బతుకుతారో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.