తెలంగాణ

telangana

'నిందితులను గుర్తించండి... కఠినంగా శిక్షించండి'

By

Published : Dec 23, 2020, 1:13 PM IST

తెలంగాణ తిరుపతిగా పేరు గాంచిన యాదాద్రి పుణ్యక్షేత్రంలో కొండ కిందనున్న యాదరుషి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వీరిపై చర్యలు తీసుకోవాలని భాజపా, విశ్వహిందూ పరిషత్, భజరంగ్​ దళ్ కార్యకర్తలు.. ఆలయ ఈవో గీతారెడ్డికి వినతిపత్రం అందించారు.

Protection of Hindu temples president giving request letter to yadadri temple eo geetha reddy
'నిందితులను గుర్తించండి... కఠినంగా శిక్షించండి'

యాదగిరిగుట్టలో తులసి కాటేజి వద్ద గల మర్రిచెట్టులో ఉన్న యాదాద్రి క్షేత్ర మునిశ్వరుడుగా పేరున్న... యాదరుషి(మహర్షి) విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విగ్రహం చేతులు విరగ్గొట్టారు.

హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కట్టె గొమ్ముల రవీందర్ రెడ్డి, భాజపా కార్యకర్తలు, భజరంగ్​ దళ్​ కార్యకర్తలు... ఈ దుశ్చర్యను ఖండించారు. నిందితులను గుర్తించి, వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆలయ ఈవో గీతారెడ్డికి వినతిపత్రం అందజేశారు.

ఇదీ చూడండి:9 నెలల తర్వాత పూరీ జగన్నాథుడి దర్శనం

ABOUT THE AUTHOR

...view details