తెలంగాణ

telangana

ఒక్కరిని ఓడించేందుకు.. మొత్తం అసెంబ్లీనే దిగివస్తోంది: కోమటిరెడ్డి సంకీర్త్​రెడ్డి

By

Published : Oct 25, 2022, 6:20 PM IST

Komatireddy sankarthreddy tweet: మునుగోడు ఉపఎన్నికలు ఎంత రసవత్తుగా సాగుతున్నాయో అందరికీ తెలిసిందే.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో అక్కడి రాజకీయ వాతావరణం నిప్పుల కుంపటిలా మారింది. ప్రత్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు సైతం ఈ ఎన్నికకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి కుమారుడు పెట్టిన ట్వీట్​ వైరల్​గా మారింది.. ఇంతకీ ఏంటా ట్వీట్​?

komatireddy sankarth reddy tweet
కోమటిరెడ్డి సంకీర్త్​రెడ్డి ట్వీట్​

RAJAGOPALREDDY SON TWEET: ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు వచ్చేశాయని... నియోజకవర్గ ప్రజలు విజయం సాధించారని భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనయుడు కోమటిరెడ్డి సంకీర్త్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఈ మేరకు ట్వీట్​ చేశారు.

''నాకు మా నాన్నను చూస్తే గర్వంగా ఉంది. ఒక్క రాజగోపాల్‌ రెడ్డిని ఓడించేందుకు 84మంది ఎమ్మెల్యేలు 16మంది మంత్రులు 15మంది ఎమ్మెల్సీలు 8నుంచి 10మంది ఎంపీలు... అధికార పోలీస్ బలగం కలిసి పనిచేస్తున్నాయి. మొత్తం అసెంబ్లీనే మునుగోడు ప్రజల ముందు మోకాళ్లపై నిలబెట్టారు'' అని ట్వీటారు. ఈ పోస్ట్ వైరల్​గా మారింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details