తెలంగాణ

telangana

మహాత్మునికి కలెక్టర్ రాజీవ్​గాంధీ హన్మంతు నివాళి

By

Published : Jan 30, 2021, 1:31 PM IST

గాంధీజీ వర్ధంతి సందర్భంగా మహాత్మునికి వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు నివాళులు అర్పించారు. కలెక్టరేట్​లో గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. పబ్లిక్ గార్డెన్​లో గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు.

tribute to mahatma gandhi on his death anniversary in warangal urban district by collector and congress leaders
గాంధీజీకి నివాళులు అర్పించిన కలెక్టర్

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్​లో మహాత్ముని చిత్ర పటానికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి గాంధీ చేసిన సేవలను కొనియాడారు.

నివాళులు అర్పిస్తున్న కాంగ్రెస్ నేతలు

పబ్లిక్ గార్డెన్ వద్ద మహాత్ముని విగ్రహానికి కాంగ్రెస్ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతిపిత చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరు ఆయన బాటలో నడవాలని సూచించారు.

ఇదీ చదవండి:బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం: మంత్రి సత్యవతి

ABOUT THE AUTHOR

...view details