తెలంగాణ

telangana

సీఎం కేసీఆర్​ కోలుకోవాలని మంత్రి సత్యవతి ప్రత్యేక పూజలు

By

Published : Apr 30, 2021, 1:32 PM IST

కరోనా మహమ్మారి నుంచి సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​ త్వరగా కోలుకోవాలని మంత్రి సత్యవతి రాఠోడ్​ ప్రత్యేక పూజలు జరిపించారు. వరంగల్​ భద్రకాళి ఆలయంలో అమ్మవారికి పూజలు చేశారు.

minister satyavati venerations for cm kcr and ktr
మంత్రి సత్యవతి ప్రత్యేక పూజలు

కరోనా బారి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరితగతిన కోలుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆకాంక్షించారు. కేసీఆర్​, మంత్రి కేటీఆర్​ ఆరోగ్యంగా ఉండాలని వరంగల్ భద్రకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు.

మంత్రితో పాటు, ప్రభుత్వ చీఫ్ విప్​ దాస్యం వినయ్ భాస్కర్​కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో తెరాస విజయం సాధిస్తుందని మంత్రి సత్యవతి ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:ఎగ్జిట్‌ పోల్స్​: నాగార్జునసాగర్​లో తెరాసకు 50.48 శాతం ఓట్లు

ABOUT THE AUTHOR

...view details