తెలంగాణ

telangana

చలికి గజగజ వణుకుతున్న హాస్టల్​ విద్యార్థులు - కనీస సౌకర్యాలు కల్పించాలంటూ ఆవేదన

By ETV Bharat Telangana Team

Published : Dec 24, 2023, 7:26 PM IST

Updated : Dec 25, 2023, 6:44 AM IST

Hostel Students Facing Problems with Cold Weather : రోజురోజుకూ రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు రావడానికి సైతం ప్రజలు వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో హాస్టల్స్​లో ఉండే విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. వసతి గృహాల్లో నివసించే విద్యార్థులకు చలిని తట్టుకునేలా కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Hostel Students Suffering from Lack of Facilities
Hostel Students Facing Problems with Cold Weather

Hostel Students Facing Problems with Cold Weather :కొన్ని రోజులుగా రాష్ట్రంలోని ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుకోవడంతో సంక్షేమ వసతి గృహాల్లోని(Welfare Hostels) విద్యార్థులు గజగజ వణుకుతున్నారు. చలిని తట్టుకునే దుప్పట్లు లేక, గీజర్లు(Hot Water Geysers) లేక చన్నీటి స్నానం చేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శీతాకాలం మొదలై నెలలు గడుస్తున్నా ప్రభుత్వం రగ్గులు అందించలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చలి పులి పంజా విసురుతోంది - తాతా బామ్మా కాస్త జాగ్రత్తగా ఉండండి

Hostel Students Suffering from Lack of Facilities : రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యంగా చలి పంజాకు సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీ ఏడాది విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పుస్తకాలతో పాటు కాలానుగుణంగా దుప్పట్లు, రగ్గులు ప్రభుత్వం అందించాలి. ఇటీవల వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో సాధారణ చలికాలం కంటే తీవ్రత ఎక్కువగా కన్పిస్తోంది. దీనివల్ల పల్చటి దుప్పట్లు, చల్లటి నీటితో స్నానం చేస్తూ విద్యార్థులు వణికిపోతున్నారు.

'హాస్టల్​లో కిటికీలు సరిగ్గా లేవు. చాలా మంది విద్యార్థులకు దుప్పట్లు లేవు. దీంతో మేం చలి తీవ్రతను తట్టుకోలేకపోతున్నాం. దీని వల్ల చాలా మందికిజలుబు, జ్వరాలు వస్తున్నాయి. సంవత్సరం క్రితమే దుప్పట్లు ఇస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. త్వరగా దుప్పట్లతో పాటు కనీస వసతులు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం' - విద్యార్థి

తుపాను ప్రభావంతో రాష్ట్రంలో పడిపోయిన ఉష్ణోగ్రతలు - పగటి పూటే వణుకుతున్న ప్రజలు

Massive Cold Hurting Hostel Students at Warangal: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమవసతి గృహాలు 300 దాకా ఉండగా అందులో 40 వేల మంది విద్యార్థులు ఉన్నారు. గతేడాది చలి కాలంలో రగ్గులు ఇచ్చారు. కానీ ఈసారి మాత్రం కొందరికే అందాయి. ఇచ్చిన రగ్గులు కూడా నాణ్యత లేకపోవడంతో చలికాలంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల కనీసం బెడ్స్‌ లేక నేలపైనే పడుకుంటున్నారు. దోమల(Mosquitoes) బెడదతో జ్వరాల బారిన పడుతున్నామని విద్యార్ఖులు వాపోతున్నారు.

'కొత్తగా వచ్చిన విద్యార్థులకు బ్లాంకెట్స్​ ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఒక్క దుప్పటితో ఇద్దరు సర్దుకుపోతున్నారు. హాస్టల్​లో కిటికీలు కూడా సరిగ్గా లేకపోవడంతో చల్లటి గాలి విపరీతంగా వీస్తుంది. దీంతో చలి తీవ్రతకు తట్టుకోలేకపోతున్నాం. దోమలు కూడా చాలా వస్తున్నాయి. దీంతో చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు' -విద్యార్థి

Hostel Students Request for Facilities : వెంటనే ప్రభుత్వం స్పందించి చలిని తట్టుకునే దుప్పట్లు(Blankets) పంపిణీ చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. స్నానం చేసేందుకు సోలార్(Solar Heaters) హీటర్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

చలికి గజగజ వణుకుతున్న హాస్టల్​ విద్యార్థులు - కనీస సౌకర్యాలు కల్పించాలంటూ ఆవేదన

రాగల మూడు రోజులు చలి తీవ్రత పెరుగుతుంది

గజగజ వణుకుతున్న తెలంగాణ - ఉన్ని దుస్తులకు పెరిగిన గిరాకీ

Last Updated :Dec 25, 2023, 6:44 AM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details