ETV Bharat / state

వేధింపులు భరించలేమంటూ విద్యార్థినుల ధర్నా - ప్రిన్సిపల్​ సస్పెండ్

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 8, 2023, 12:56 PM IST

TTWRDC Asifabad Students Protest : ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద బూరుగుడా గిరిజన సంక్షేమ కళాశాల విద్యార్థినులు ధర్నాకు దిగారు. కళాశాల ప్రిన్సిపల్‌ దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ విద్యార్థినులు నిరసన చేపట్టారు. ప్రిన్సిపల్‌ వేధిస్తున్నారంటూ రోడ్డుపై బైఠాయించారు. అనంతరం కలెక్టరేట్‌ వద్దకు నడుచుకుంటూ ర్యాలీగా వెళ్లారు.

Students Dharna In Asifabad
TTWRDC College Students Dharna In Asifabad

వేధింపులు భరించలేమంటూ విద్యార్థినుల ధర్నా - ప్రిన్సిపాల్​ సస్పెండ్

TTWRDC Asifabad Students Protest : ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద బూరుగుడా విద్యార్థినులు ధర్నాకు దిగారు. కళాశాల ప్రిన్సిపల్‌ తమను వేధిస్తున్నారంటూ ఆరోపించారు. మొదట హస్టల్‌ ఎదుట రోడ్డుపై బైఠాయించి, అనంతరం కలెక్టర్‌ కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లారు. పోలీసులు, ఉన్నతాధికారులు అక్కడకు చేరుకొని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తమను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రిన్సిపల్‌ను సస్పెండ్‌ చేయాల్సిందేనని విద్యార్థినులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ప్రిన్సిపల్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

Asifabad TTWRDC Students Protest Against Principal : ఆసిఫాబాద్‌లో గురుకుల గిరిజన కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థినులు ప్రిన్సిపల్‌ తీరుతో ఆందోళన బాట పట్టారు. కళాశాల ప్రిన్సిపల్‌ దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ విద్యార్థినులు నిరసనకు దిగారు. ఆసిఫాబాద్‌ జిల్లా బూరుగుడా సమీపంలోని ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ డిగ్రీ కళాశాలలో(Tribal Welfare Residential Degree College For Women) ప్రిన్సిపల్‌ దివ్యరాణి తమను వేధిస్తున్నారంటూ విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించారు. అనంతరం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కలెక్టరేట్‌ వద్దకు నడుచుకుంటూ ర్యాలీగా వెళ్లారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే అధికారులు పట్టించుకోకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు.

"ప్రిన్స్​పల్ మా సమస్యలు అసలు పట్టించుకోవడం లేదు. మా పట్ల దురుసుగా ప్రవర్తించారు. మమల్ని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. హాస్టర్ ఆహారం బాగోలేదని మా సమస్యలు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. దాదాపు సంవత్సరం నుంచి ప్రిన్సిపల్‌ తమను వేధింపులకు గురిచేస్తున్నారు. ఆర్​సీవో వచ్చినా తమను కలవడాని ప్రిన్సిపల్‌ అనుమతిచ్చేవారు కాదు. కళాశాలలో జరిగే కార్యక్రమాలకు మా దగ్గరే డబ్బులు వసూలు చేస్తున్నారు. మాకోసం ప్రభుత్వం ద్వారా వచ్చే బడ్జెట్ వివరాలు కూడా తెలియనివ్వడం లేదు. మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రిన్సిపల్‌ను సస్పెండ్‌ చేయాల్సిందే " - విద్యార్థినులు

రోడ్డుపై బైఠాయించిన నిజాం కళాశాల విద్యార్థినులు - వసతి గృహంలో సదుపాయాలు కల్పించాలని డిమాండ్

Tribal Welfare Women Degree College In Asifabad : దాదాపు సంవత్సరం నుంచి ప్రిన్సిపల్‌ తమను వేధింపులకు గురిచేస్తున్నారని విద్యార్థినులు తెలిపారు. ఆర్​సీవో వచ్చినా తమను కలవడాని ప్రిన్సిపల్‌ అనుమతిచ్చేవారు కాదని ఆరోపించారు. విద్యార్థినుల ధర్నా గురించి తెలుసుకున్న డీఎస్పీ, ఉన్నతాధికారులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారితో విద్యార్థినులు తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న ఉన్నతాధికారి సోమనాథ్ శర్మ ప్రిన్సిపల్‌ను సస్పెండ్‌ చేయడంతో విద్యార్థినులు ధర్నా విరమించారు.

Raging in Gandhi Medical College : గాంధీ మెడికల్​ కాలేజీలో ర్యాగింగ్ రగడ.. ధర్నాకు దిగిన విద్యార్థులు

Sammakka Sarakka Tribal University : HCU స్థాయిలో గిరిజన యూనివర్సిటీ.. వచ్చే ఏడాది నుంచి తరగతులు!

అధ్వాన్నంగా కళాశాల - వసతుల్లేక విద్యార్థులు విలవిల - ఇలా అయితే చదువులు సాగేదెలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.